మర్చంట్‌ హమాలీలకు హమాలీ కూలి రేట్లు పెంచాలి

– ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం. నరసింహ డిమాండ్‌
నవతెలంగాణ కంటోన్మెంట్‌
సికింద్రాబాద్‌. మోండా మార్కెట్‌ గ్రైన్‌ మర్చంట్‌ విభాగంలో గ్రెయిన్‌ విభాగంలో పనిచేస్తున్న హమాలీలు ఆదివాకం ఏఐటీయూసీలో చేరారు. మోండా మార్కెట్‌ లోని గ్రేన్‌ వర్తకుల సంఘం కార్యాలయంలో హమాలి యూనియన్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ మాట్లాడుతూ.. హమాలీలతో 12 గంటలు పని చేయించుకుంటూ వారికి శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌లో హమాలీలకు చట్ట ప్రకారం ప్రతీ సంవత్సరం రెండు జతల యూనిఫాం, మార్కెట్‌ కమిటీ నుంచి లైసెన్సులు అందవలసి ఉన్నదని వాటి అమలు కోసం యూనియన్‌ పోరాటం చేస్తుందని చెప్పారు. కూరగాయల విభాగంలో ఇస్తున్నట్టుగానే గ్రెయిన్‌ విభాగంలో పనిచేస్తున్న హమాలీలకు సైతం హమాలి చార్జీలు చెల్లించాలని అందుకు పోరాటాలు చేస్తామని హామీ ఇచ్చారు. హమాలీలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించే విషయంపై కూడా న్యాయ పోరాటం చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో హమాలి యూనియన్‌ నాయకులు బెల్లపు నరేష్‌, మోటే రవి, హత్కూరి యాదగిరి, సిద్ధులు, కుమార్‌, బొందయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love