
నవతెలంగాణ – బెజ్జంకి
హైకోర్ట్,జాయింట్ కలెక్టర్ అదేశానుసారం విచారణ చేపట్టి బెజ్జంకి శివారులోని సర్వే నంబర్ 962 యందు సుమారు 25 ఏకరాల ప్రభుత్వ భూమిని అక్రమణదారుల వద్ద నుండి స్వాదీనం చేసుకున్నామని తహసిల్దార్ ఎర్రోల్ల శ్యామ్ శుక్రవారం తెలిపారు. బెజ్జంకి శివారులోని 962 సర్వే నంబర్ యందు అక్రమణకు గురైన భూమిపై న్యాయం కోసం బాధితులు హైకోర్టును అశ్రయించారు.హైకోర్ట్,జాయింట్ కలెక్టర్ సూచన ప్రకారం విచారణ చేపట్టి నిజనిర్దారించి ఆర్ఐ సుహసిని,ఎస్ఐ క్రిష్ణారెడ్డి సమక్షంలో స్వాదీనం చేసుకున్న ప్రభుత్వ భూమిలో హెచ్చరిక సూచిక బోర్డ్ ఏర్పాటుచేసినట్టు తహసిల్దార్ తెలిపారు.స్వాదీనం చేసుకున్న ప్రభుత్వ భూమిని అక్రమిస్తే చట్టపరమైన కఠిన చర్యలు చేపడుతామని తహసిల్దార్ హెచ్చరించారు.
అధికారులు అన్యాయంగా వ్యవహరించారు: గత ముప్పై ఏండ్లుగా 962 సర్వే నంబర్ యందు వ్యవసాయం సాగు చేస్తున్నామని..ప్రభుత్వ అదేశాలను అందించకుండా భూమి సాగు చేస్తున్నవారికి సమచారం ఇవ్వకుండా హుటాహుటిన ప్రభుత్వ భూమంటూ స్వాదీనం చేసుకోవడం అధికారులు అన్యాయంగా వ్యవహరించారని భూమిని సాగు చేస్తున్నవారు అవేదన వ్యక్తం చేశారు.కనీసం వివరణ ఇచ్చుకోవడానికి అధికారులు సమయం ఇవ్వకపోవడం ఏకపక్షంగా వ్యవహరించడమేనని అసహనం వ్యక్తం చేశారు.