మహిళా సమస్యలపై పీఓడబ్ల్యూ బహుముఖ పోరాటాలు

మహిళా సమస్యలపై పీఓడబ్ల్యూ బహుముఖ పోరాటాలు– పీఓడబ్ల్యూ గ్రేటర్‌ హైదరాబాద్‌ మహాసభలలో వక్తలు
నవతెలంగాణ-ముషీరాబాద్‌
గత ఐదు దశాబ్దాలుగా ప్రగతి శీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) రెండు తెలుగు రాష్ట్రాలలో మహిళా సమస్యలపై బహుముఖ పోరాటాలు చేస్తూ మహిళలకు బాసటగా నిలు స్తున్నదని జర్నలిజం కళాశాల ప్రిన్సిపాల్‌ గౌరీ, విశ్రాంత ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘ కార్యదర్శి కమల అన్నారు. బుధవారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో పిఓడబ్ల్యూ గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షులు జి.అనసూయ అధ్యక్షతన పీఓడబ్ల్యూ గ్రేటర్‌ హైదరాబాద్‌ మహాసభలు నిర్వహించారు. ఈ మహాసభలలో జర్నలిజం కళాశాల ప్రిన్సి పాల్‌ గౌరీ, విశ్రాంత ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘ కార్య దర్శి కమల వక్తలుగా హాజరై మాట్లాడుతూ.. నేడు సమాజంలో స్త్రీలపై అనేక రూపాలుగా జరుగుతున్న దోపిడీ, అణిచివేత, వివక్ష, భౌతిక ఆర్థిక సామాజిక దాడులు హింస నిరవధికంగా కొనసాగుతూనే ఉన్నాయన్నారు. ప్రశ్నించే గొంతుకల మీద ఉక్కుపాదం మోపడం సత్యాలు మాట్లాడినందుకు ట్రోలింగు లకు, వేధింపులకు, బెదిరింపులకు గురి కావడం మహిళా ఉద్యమకారులపై ఊపా వంటి చట్టాలను ప్రయో గించి నిర్బంధం చేయడం, ప్రజా ఉద్యమాలను అణిచి వేయడానికి మణిపూర్‌లో మహిళను నగంగా ఊరేగించడం వంటి అనాగరికంగా, నీచ చర్యలు ప్రభుత్వాలకు మహిళల పట్ల ఎంతటి చులకన భావం ఉందో తెలియజేస్తుంది. మహిళా లోకాన్ని సంఘటిత పరిచి సాధికారత సాధన కొరకు పీఓడబ్ల్యూ గ్రేటర్‌ హైదరాబాద్‌ మహాసభలు నిర్వహించుకుం టుందన్నారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు ఝాన్సీ , ప్రధాన కార్యదర్శి అందే మంగ, జిల్లా కార్యదర్శి కావేరి, కమిటీ సభ్యులు సంతోష, పుష్ప, నవ్య, సుజాత, ప్రేమలత తదితరులు పాల్గొన్నారు.

Spread the love