వేములవాడ పట్టణం శాత్రాజుపల్లి కి చెందిన గుడిసె ప్రభాకర్ ని తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి గా నియమిస్తున్నట్లుగా అధ్యక్షులు శివసేన రెడ్డి, ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా గుడిసె ప్రభాకర్ మాట్లాడుతూ.. నాపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ జాతీయ, రాష్ట్ర అధినేతలకు, యూత్ కాంగ్రెస్ జాతీయ ఇంచార్జ్ కృష్ణ అలువారి, జతీయ అధ్యక్షులు బీవీ శ్రీనివాస్, రాష్ట్ర ఇన్చార్జ్ లు సురభి ద్వివేది, కలిద్ అహ్మద్, రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి. మాజీద్ ఖాన్, కు వేములవాడ శాసన సభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి, రాజన్న సిరిసిల్ల జిల్లా అద్యక్షులు సంగీతం శ్రీనాథ్ (వీంకు) కి , కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సంఘ స్వామి కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను ముఖ్యంగా యువతలోకి తీసుకువెళ్లి కాంగ్రెస్ పార్టీ యువతకు చేరువయ్యేలా పనిచేస్తారని అన్నారు.