ప్రభాస్ ” కల్కి” సినిమా సెన్సార్ పూర్తి.!

నవతెలంగాణ – హైదరాబాద్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి’ సినిమా సెన్సార్ పూర్తయినట్లు తెలుస్తోంది. సినిమాకు U/A సర్టిఫికెట్ లభించింది. అయితే సినిమా రన్ టైం మొత్తం 2.58 గంటలు ఉండనుందని సమాచారం. మొత్తంగా విజువల్స్ అదిరిపోయాయని, ఎమోషన్స్& ఎంటర్‌టైన్మెంట్‌ను సమపాళ్లలో జోడించి చూపించారని సెన్సార్ టీమ్ అభిప్రాయపడినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. వారు స్టాండింగ్ ఓవేషన్‌తో టీమ్‌ని మెచ్చుకున్నారని తెలిపాయి. కాగా ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా ‘కల్కి’ విడుదల కానుంది.

Spread the love