ప్రక్షిప్త సావర్కరీయం…

”హిట్లర్‌ యూదులను శిక్షించినట్లు మనం ముస్లింలను హింసించాలి. ముస్లింలు యూదులతో సమానం. దళితులు దేవాలయాల్లోకి వెళ్లరాదు. ఇండియాకు ఇంగ్లండ్‌ నుండి స్వాతంత్య్రం కంటే హిందువులకు క్రైస్తవులు, ముస్లింల నుండి స్వేచ్ఛ కావాలి. మోసగాళ్ళైన ముస్లింలను పోలీసు, సైన్యం, ప్రజాసేవల్లో నియమించరాదు. వంటిల్లు, పిల్లల పెంపకాలే స్త్రీల విధులు. అందమైన ముస్లిం యువతులను బంధించి, హిందూవులుగా మార్చి మరాఠా యోధులకు కానుకగా ఇవ్వాలి. హిందువులు ముస్లిం స్త్రీలను లైంగిక వేధింపులకు గురిచేయాలి. ముస్లిం స్త్రీలు, పిల్లలు తెల్లగా ఉండటం పాపం. వారి తలలను నల్ల ఖడ్గాలతో నరకాలి. నమ్మకద్రోహులైన ముస్లింలకు వారి వాటాకు మించి ఇస్తున్నారు. హిందువులను దోచుకుంటున్నారు” ఇవీ సావర్కర్‌ భావాలు. నాథురామ్‌ గాడ్సే సావర్కర్‌ సలహా సంప్రదింపులతో గాంధీని చంపారు. గాంధీ హత్యలో సావర్కర్‌ సహకుట్రదారుడు. ఆధారం లేదని కోర్టు ఆయనను వదిలేసింది. సావర్కర్‌, గోల్వాల్కర్‌ ఇజ్రాయిల్‌ ఏర్పాటుకు మద్దతిచ్చారు. హిట్లర్‌ ‘స్వచ్ఛ జాతి’ ఆదర్శాన్ని, యూదు వ్యతిరేక ‘మతం, భాష, సంస్కృతి’ సిద్ధాంతాన్ని కొనియాడారు. సావర్కర్‌ క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని బహిష్కరించారు. మీ పదవులను అంటిపెట్టుకొని ఉండండని స్థానిక సంస్థల హిందూ మహాసభ ప్రతినిధులకు ఉత్తరాలు రాశారు. సావర్కర్‌ రాజకీయ తీవ్రవాదాన్ని మత సమూహాల్లోకి చొప్పించారు. భారతీయులంతా హిందువులేనన్న సావర్కర్‌ హిందూత్వం, మతాలన్నీ కలిసి జీవించాలన్న గాంధీ హిందూమతానికి వ్యతిరేకం. గాంధీ హిందుత్వానికే వ్యతిరేకమని గాంధీ హత్య నిరూపిస్తోంది. హిట్లర్‌ అబద్ద ప్రచారాలకు 80సినిమాలు తీశారు. సంఫ్‌ు ‘కశ్మీర్‌ ఫైల్స్‌’, ‘కేరళ స్టోరీ’ తీసింది. స్వాతంత్య్ర వీర్‌ సావర్కర్‌ సినిమాలో సావర్కర్‌ను నేతాజీ, ఖుదిరామ్‌ బోస్‌లకు స్ఫూర్తి ప్రదాతగా చూపారు. సావర్కర్‌ వీర్‌ను తగిలించుకున్నారు. స్వాతంత్య్ర సమరానికి సావర్కర్‌ వెన్నుపోటును దాయడానికి నానా యాతనలు పడ్డారు. అనేక ప్రక్షిప్తాలను జోడించారు.నేటికీ సావర్కర్‌ అంటే స్వాతంత్య్ర సమరయోధుడని కీర్తిస్తున్నారు బీజేపీ- ఆరెస్సెస్‌ నాయకులు. అసలు సావర్కర్‌ స్వాతంత్య్ర ఉద్యమం సాగుతున్న క్రమంలో ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? ఏం చేశాడు అనే విషయాలు చాలామందికి తెలియవు. ఎందుకంటే దేశాన్ని మత విద్వేషం నింపుకున్న పార్టీ నేడు పాలిస్తున్నది. సావర్కర్‌ను ఒక వీరుడని, త్యాగధనుడని, మహనీయుడని చరిత్రను తిరగరాసి చెబుతున్నది. అసలు సావర్కరీయం గురించి నేటితరం తెలుసుకోకపోతే స్వాతంత్య్ర పోరాటంలో ఆయన గొప్ప వ్యక్తి అని, దేశానికి ఎంతో సేవ చేశారని అనుకునే ప్రమాదం ఉంది. నాడు గాంధీ నాయకత్వంలో ఉవ్వెత్తున్న సాగుతున్న స్వాతంత్య్ర ఉద్యమంలో సావర్కర్‌ అసలు పాల్గొననే లేదు.
ఇది నగసత్యం.
హిందూత్వాన్ని పునర్మించాలని జైలు నుంచి విడుదల
1920లో వల్లభ్‌ పటేల్‌ అన్న విఠల్‌ సావర్కర్‌ను జైలు నుండి వదలాలని కోరారు. జనవరి 6,1924న రత్నగిరి జిల్లాను దాటరాదన్న షరతుతో విడుదల చేశారు. దేశాన్ని హిందుత్వ ప్రాతి పదికన పునర్నిర్మించాలన్న ఆశయంతో జైలు నుండి బయటకు రావడానికి సావర్కర్‌ బ్రిటిష్‌వారికి క్షమాపణలు రాసిచ్చి వచ్చాడు. రత్నగిరిలో హిందూ మహాసభను ప్రారంభించారు. హిందూ మతమార్పిళ్ళను ఆపడానికి కులవివక్ష వ్యతిరేక ప్రచారం చేశారు. క్రైస్తవానికి, ఇస్లామిజానికి మారినవారిని హిందుమతానికి మార్చారు. ఇది మత కలహాలకు దారితీసింది. హిందువులు రక్షణ కొరకు లాఠీలను, మరతుపాకులను, జలాంతర్గాములను వాడాలని బోధించారు. హైందవ ఉగ్రవాదానికి, బజరంగ్‌ సైనికీకరణకు, సాయుధ హిందుసేన నిర్మాణానికి ఇదే ప్రాతిపదిక. హిందు జాతీయవాదానికి అనుగుణంగా పురాణాల ప్రాతిపదికన చరిత్రను తిరగరాశారు సావర్కర్‌. వైదిక హిందుత్వానికి అన్వయించారు. మనుస్మృతిని ప్రశంచించిన మేధాతిథిని మెచ్చుకున్నారు. బుద్ధయిజాన్ని వ్యతిరేకించారు. అక్బర్‌ గొప్పవాడయినా అతని విదేశీయత, పరమత నీచగుణాలను హిందు వులు దూషించాలన్నారు. ఆగస్టు 1, 1938న బహిరంగసభలో హిట్లర్‌ నాజీయిజాన్ని, ముసోలిని ఫాసిజాన్ని సమర్థించారు. జర్మనీ, ఇటలీలను ఖండించారని నెహ్రూను విమర్శించారు. 1939లో ముస్లిం లీగ్‌తో పొత్తు పెట్టుకున్నారు. ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ముస్లింలందరూ మరో దేశానికిపోతే ఇండియా హిందూదేశంగా మారుతుందని సావర్కర్‌ ఆశ. ”రాజకీయాలను హైందవీకరించండి. హిందుత్వాన్ని సైనికీక రించండి” అని హిందుమహాసభ అధ్యక్షునిగా రెండవ ప్రపంచ యుద్ధంలో నినదించారు. హిందువులకు సైనిక శిక్షణనివ్వమని బ్రిటిష్‌ అధికారులను వేడుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో ఆంగ్లేయులకు మద్దతిస్తూనే హిట్లర్‌ను సమర్థించారు. ”హిట్లర్‌ యూదులను శిక్షించినట్లు మనం ముస్లింలను హింసించాలి. ముస్లింలు యూదులతో సమానం. దళితులు దేవాలయాల్లోకి వెళ్లరాదు. ఇండియాకు ఇంగ్లండ్‌ నుండి స్వాతంత్య్రం కంటే హిందువులకు క్రైస్తవులు, ముస్లింల నుండి స్వేచ్ఛ కావాలి. మోసగాళ్ళైన ముస్లింలను పోలీసు, సైన్యం, ప్రజాసేవల్లో నియమించరాదు. వంటిల్లు, పిల్లల పెంపకాలే స్త్రీల విధులు. అందమైన ముస్లిం యువతులను బంధించి, హిందూవులుగా మార్చి మరాఠా యోధులకు కానుకగా ఇవ్వాలి. హిందువులు ముస్లిం స్త్రీలను లైంగిక వేధింపులకు గురిచేయాలి. ముస్లిం స్త్రీలు, పిల్లలు తెల్లగా ఉండటం పాపం. వారి తలలను నల్ల ఖడ్గాలతో నరకాలి. నమ్మకద్రోహులైన ముస్లింలకు వారి వాటాకు మించి ఇస్తున్నారు. హిందువులను దోచుకుంటున్నారు” ఇవీ సావర్కర్‌ భావాలు. ముస్లింలతో పాటు హిందుతీవ్రవాదులూ దేశ విభజనకు కారణమే. ముస్లింలు తప్పుడు తోవలోపోయే అశుద్ధులు. వారితో సహజీవనం కుదరదని హిందుతీవ్రవాదుల వాదన. పరస్పర అపనమ్మకం హిందూ, ముస్లింలు రెండు భిన్నజాతులన్న భావనను, మత అసహనాన్ని, ద్వేషాన్ని పెంచి సమర్థించింది. సావర్కర్‌ ఈ భావజాలాన్ని తీవ్రతరం చేశారు. విభజనవాదనకు మతవాదాన్ని జోడించి ఆజ్యంపోశారు.
హిందూత్వం…రాజకీయ అధికారం పొందే పిడివాదం
బెంగాలి సంప్రదాయ సాహిత్యకారుడు, హిందూత్వ సూత్ర స్థాపకుడు చంద్రనాథ్‌ బసు 1892లో ముద్రించిన పుస్తకం ‘హిందుత్వ’లో హిందుత్వ పదం మొట్టమొదట నమోదయింది. హిందూ సాంస్కృతిక జాతీయవాద ప్రధాన రూపం హిందుత్వ. సావర్కర్‌ రత్నగిరి జైలులో హిందూత్వ కరపత్రం రాశారు. ‘హిందూత్వ’ను రాజకీయ నిఘంటువులో చేర్చారు. ఇది హిందుత్వవాదులకు హిందూదేశ సిద్ధాంత వర్ణనగా, లౌకికవాదులకు మత ప్రాతిపదికన దేశాన్ని చీల్చేదిగా, ముస్లింలను బలిపశువులను చేసేదిగా అర్థమైంది. సావర్కర్‌కు ముందు వివేకానంద, దయానంద సరస్వతి వంటి సాధువులు, లోకమాన్య తిలక్‌ వంటి రాజకీయ నాయకులు హిందూ పునరుద్ధరణ చేపట్టారు. జైనబౌద్ధాలను అడ్డుకున్నారు. క్రైస్తవానికి మతమార్పిళ్ళను విమర్శించారు. హిందూత్వ పురోగతికి పునాదులు వేశారు. సావర్కర్‌ హిందూ పునరుజ్జీవనాన్ని మత చర్యగా కాక రాజకీయ కోణంలో నిర్వచించారు. హిందూత్వం, హిందూమతం వేరన్నారు. హిందూ పదం వేదకాలానిదన్నారు. హిందూదేశ నిర్మాణం సావర్కర్‌ ఉద్దేశం కాదు. సహజ మూలభావంలో ప్రాచీనకాలం నుండే భారత్‌ హిందుదేశమని వివరించారు. ‘ఈ దేశాన్ని పితృభూమిగా, పుణ్యభూమిగా పరిగణించే వారంతా హిందువులే. ఈ ప్రాతిపదికన సిక్కులు బౌద్ధులు, జైనులు హిందువులు. ముస్లింలు, క్రైస్తవులు దేశభక్తులైనా వారి పుణ్యభూములు అరేబియా, ఇజ్రాయిల్‌లలో ఉన్నాయి. వారు హిందువులు కారు’ అని వ్యాఖ్యా నించారు. సావర్కర్‌ హిందూత్వ పదాన్ని 1923లో విస్తృతంగా ప్రచారం చేశారు. వ్యంగ్య పోటీతో ముస్లింలను అనుకరించి, వారిని అపకీర్తి పాల్జేసి, బెదిరించటం ద్వారా గుర్తింపు పొందడానికి సావర్కర్‌ చేసిన అపూర్వ కృషి ఇది. ఆయన జర్మనీ, ఇటలీల జాత్యాహంకార, సాంస్కృతిక జాతీయవాద భావాలను దిగుమతి చేసుకున్నారు. మతం-సంస్కృతి, దేశం-రాజ్యం వంటి విభిన్న ఇరుసు సిద్దాంతాలను ప్రవేశ పెట్టారు. హిందు జాతీయవాద సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌, దాని అనుబంధ సంఫ్‌ు పరివార్‌ సంస్థలు హిందూత్వ పదానికి మద్దతుపలికి తీవ్ర ప్రచారం చేశాయి. సావర్కర్‌ హిందుత్వ నిర్వచనంలో ఉమ్మడి దేశం, ఉమ్మడి జాతి, ఉమ్మడి సంస్కృతి అత్యవసర అంశాలు. హిందుత్వంలో హిందు, జైన, బౌద్ధ, సిక్కు మతాలను కలిపారు. నాస్తికుడైన సావర్కర్‌కు ముస్లింలు శత్రువులు. బ్రిటిష్‌ వారు కాదు. ఆంగ్లేయుల ఆర్థిక దోపిడీ కంటే ముస్లింల సాంస్కృతిక కాలుష్యం అపాయకరమని ప్రచారం చేశారు. మతం మారిన క్రైస్తవులు, ముస్లింలను ఉమ్మడి సంస్కృతిలో చేర్చారు. హిందూమతం నుండి హిందు, హిందూత్వ భావాలను సావర్కర్‌ వేరు చేశారు. ‘హిందుత్వం విశాల భావాల మానవ భాష. ప్రజల ఆధ్యాత్మిక చరిత్ర కాదు. సంపూర్ణ మానవ చరిత్ర’ అని అతిశయించారు. హిందూ జాతీయ వాదానికి సావర్కర్‌ భావం గట్టి పునాది వేసింది. హిందూ విశ్వాసాల, ఛాందస ఆచారాల, ‘ఉన్నత’ ఉగ్రాగ్ర కుల పెత్తనాల రాజకీయ ఉద్యమం హిందుత్వ. రాజ్యాధికారం పొందటానికి మార్గాలు చూపిన పిడివాదం.
గాంధీ హత్యలో సావర్కర్‌ సహకుట్రదారుడు!
హిందూత్వంతో అతి సన్నిహిత సంబంధం గల హిందుమతోన్మాది సంఫ్‌, హిందు మహాసభల సభ్యుడు నాథురామ్‌ గాడ్సే సావర్కర్‌ సలహా సంప్రదింపులతో గాంధీని చంపారు. గాంధీ హత్యలో సావర్కర్‌ సహకుట్రదారుడు. ఆధారం లేదని కోర్టు ఆయనను వదిలేసింది. సావర్కర్‌, గోల్వాల్కర్‌ ఇజ్రాయిల్‌ ఏర్పాటుకు మద్దతిచ్చారు. హిట్లర్‌ ‘స్వచ్ఛ జాతి’ ఆదర్శాన్ని, యూదు వ్యతిరేక ‘మతం, భాష, సంస్కృతి’ సిద్ధాంతాన్ని కొనియాడారు. సావర్కర్‌ క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని బహిష్కరించారు. మీ పదవులను అంటిపెట్టుకొని ఉండండని స్థానిక సంస్థల హిందూ మహాసభ ప్రతినిధులకు ఉత్తరాలు రాశారు. సావర్కర్‌ రాజకీయ తీవ్రవాదాన్ని మత సమూహాల్లోకి చొప్పించారు. భారతీయులంతా హిందువులేనన్న సావర్కర్‌ హిందూత్వం, మతాలన్నీ కలిసి జీవించాలన్న గాంధీ హిందూమతానికి వ్యతిరేకం. గాంధీ హిందుత్వానికే వ్యతిరేకమని గాంధీ హత్య నిరూపిస్తోంది. హిందుమతాన్ని గాంధీ అధికంగా ప్రేమించినా ఏ మతాన్నీ అగౌరవించలేదు. గాంధీ మతం మానవత్వం, మానవ సేవ, సర్వోదయం అని లౌకికవాదుల భావన. గాంధీని జాతిపిత అనరాదని, జాతీయతకు ఆధారం హిందూత్వమేనని 1961లో సావర్కర్‌ ఉద్బోధించారు. హిందుత్వవాద సావర్కర్‌ స్వాతంత్య్ర సమరయోధులకు స్ఫూర్తినిచ్చారనడం చారిత్రక ఎగతాళి, చౌకబారు ప్రచారమని నేతాజీ, ఖుదిరామ్‌ బోస్‌ కుటుంబ సభ్యులన్నారు. సావర్కర్‌ హిందూ దేశవాది. ఆయనను నేతాజీ వ్యతిరేకించారు. వైదికమత ఛాందసులు చరిత్రను దేశ నిర్మాణానికి కాక సామాజిక విచ్ఛిత్తికి వాడుతున్నారు. సావర్కరీయులు ప్రక్షిప్త చరిత్రను ప్రచారం చేస్తున్నారు. తమ దేశద్రోహ చరిత్రను మార్చి దేశాభివృద్ధిని సాధించగలరా?
సంగిరెడ్డి హనుమంతరెడ్డి
సెల్‌: 9490204545

Spread the love