ఏ శ్రమనైనా గౌరవించండి

ఉద్యోగాల వెంట పరుగెత్తడం ఆపండి
– దేశంలో నిరుద్యోగ సమస్య ఉండదు : ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : భారత్‌లో నిరుద్యోగ సమస్యపై ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. బాసాన్లు కడిగే పని అయినా.. బీటెక్‌ చదివిన వ్యక్తి ఆనందంగా చేయటం మొదలు పెడితే దేశంలో నిరుద్యోగ సమస్యే ఉండదని అన్నారు. ఏ శ్రమనైనా గౌరవించకనే.. దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతున్నదని చెప్పారు. పని స్వభావంతో సంబంధం లేకుండా అన్ని రకాల పనులనూ ప్రజలు గౌరవించాలని కోరారు. ఉద్యోగాల వెంట పరుగె త్తడం ఆపాలన్నారు. పనిలో చిన్న, పెద్ద ఉండదనీ, అది సమాజం కోసం చేయబడుతుందని భగవత్‌ చెప్పారు. పని శారిరక శ్రమైనా లేదా మేధస్సు కు సంబంధించిందైనా.. అన్నిటినీ తప్పక గౌరవించాలని తెలిపారు. ” మన చుట్టూ ఉన్న ప్రభుత్వ ఉద్యో గాలు పది శాతమే. ఇతర ఉద్యోగాలు 20 శాతం ఉంటాయి. ప్రపంచం లో ఏ సమాజమూ 30 శాతానికి మించి ఉద్యోగాలు సృష్టించలేదు. చేతి శ్రమ అవసరమున్న పనికి ఇప్పటికీ గౌరవం దక్కటం లేదు” అని ఒక కార్యక్రమం లో పాల్గొన్న ఆయన అన్నారు. నైపుణ్యాలు ఉంటే ఉన్నతస్థాయికి చేరు కుంటారనీ, ప్రతి ఒక్కరూ నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు. కప్పులు కడిగే ఒక వ్యక్తి పాన్‌ షాపు పెట్టుకొని రూ. 28 లక్షలు సంపాదిం చాడనీ, పనిపై గౌరవం ఉంటే వారు ఉన్నతస్థాయికి చేరుకుంటారని మోహన్‌ భగవత్‌ చెప్పారు. అయితే, ఆరెస్సెస్‌ చీఫ్‌ చేసిన వ్యాఖ్యలపై దేశంలోని నిరుద్యోగులు, రాజకీయ పార్టీల నాయకుల నుంచి విమర్శలు వచ్చాయి.

 

Spread the love