చట్టాన్ని రద్దు చేయాలి : సీపీఐ(ఎం)
న్యూఢిల్లీ : భారతీయ శిక్షా స్మృతిలోని దేశద్రోహం నిబంధనను సర్దు బాటు చేయడంపై లా కమిషన్ చేసిన సిఫారసులు సమగ్రంగా లేవని, పైగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలను అవి తోసిపుచ్చుతున్నాయని సిపిఎం పొలిట్ బ్యూరో పేర్కొంది. ఈ కాలం చెల్లిన చట్టాన్ని శాసన పుస్తకాల నుంచి తొల గించేందుకు తగిన చట్టపరమైన చర్యలను కేంద్ర ప్రభుత్వం తీసుకునే వరకు దేశద్రోహ చట్టం అమలుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. అయితే, కనీస జైలు శిక్షను గతంలోని మూడు సంవత్సరాల నుంచి ఏడేండ్లకు పెం చడం ద్వారా దేశద్రోహం చట్ట నిబంధనలను లా కమిషన్ మరింత బలో పేతం చేసినట్లు కనిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీల నేతలను లక్ష్యంగా చేసుకు నేందుకు ఈడీ, సీబీఐలను దారుణంగా దుర్వినియోగ పరుస్తున్న నేపథ్యం లో ఈ సిఫార్సులు అరిష్టాన్ని కలగచేస్తాయని పొలిట్‌బ్యూరో పేర్కొంది.