ధరల నియంత్రణలో కేంద్రం విఫలం

– టమాటా రేట్లే ప్రత్యక్ష ఉదాహరణ
– టోకు వ్యాపారులకు కనక వర్షమే బీజేపీ విధానం
– వచ్చే ఎన్నికల్లో లబ్ది కోసమే యూసీసీపై చర్చ
– సంఫ్‌పరివార్‌ వల్లే మణిపూర్‌లో మంటలు
– తెలుగు రాష్ట్రాల్లోకి బీజేపీని రానివ్వం
– మతోన్మాద, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వచ్చే వారితో కలిసి పనిచేస్తాం: సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాల్లో బీవీ రాఘవులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ ప్రాబల్యం రోజురో జుకు వేగంగా దిగజారుతున్న దనీ, పెరు గుతున్న ధరలను నియంత్రించడంలో ఆపార్టీ ఘోరంగా వైఫల్యం చెందిం దని సీపీఐ(ఎం) పోలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. హైద రాబాద్‌లోని ఎమ్‌బీ భవన్‌లో శనివారం గంటలకే ఆమాద్మీ పార్టీ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సోమ, మంగళవారాల్లో బెంగళూరులో జరిగే ప్రతిపక్షాల భేటీకి తాము హాజరవుతున్నామని చెప్పారు. కేంద్ర ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా పార్లమెంటులో ఓటు చేస్తామని కాంగ్రెస్‌ హామీ ఇవ్వకపోతే తాము బెంగళూరు సమావేశానికి హాజరుకాబోమని కేజ్రీవాల్‌ అంతకుముందు హెచ్చరించారు. దీంతో కాంగ్రెస్‌ అంతర్గత కమిటీ సమావేశమై కేంద్ర ఆర్డినెన్స్‌పై కేజ్రీవాల్‌కు బాసటగా నిలవాలని నిర్ణయించింది. గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేసి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల అధికారాల్లో జోక్యం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ చర్యకైనా తమ పార్టీ వ్యతిరేకమని కాంగ్రెస్‌ ప్రధానకార్యదర్శి కెసి వేణుగోపాల్‌ చెప్పారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. పార్లమెంటులో ఢిల్లీ ఆర్డినెన్స్‌ బిల్లు ఎప్పుడు ప్రవేశపెట్టినా వ్యతిరేకించాలని పార్టీ నిర్ణయించినట్లు తెలిపారు.
‘సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలన్నిటినీ నికరంగా వ్యతిరేకిస్తూనేవున్నాం. గవర్నర్ల ద్వారా రాష్ట్రాలను పాలించాలన్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూనేవున్నాం. మా వైఖరి చాలా స్పష్టం. ఢిల్లీ ఆర్డినెన్స్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వబోం’ అని కెసి వేణుగోపాల్‌ చెప్పారు. ఆ వెంటనే ఆప్‌ ఎంపీ, జాతీయ అధికార ప్రతినిధి రాఘవ్‌ చద్దా దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ,కాంగ్రెస్‌ ప్రతిపక్షాల ఐక్య గళాన్ని వినిపించడం ఓ సానుకూల పరిణామం’ అని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో బ్యూరోక్రాట్ల నియామకాలు, బదిలీల విషయంలో అంతిమ నిర్ణయం ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వానిదేనని సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు భిన్నంగా బ్యూరోక్రాట్లపై అధికారాన్ని లెఫ్టినెంట్‌ గవర్నరుకు కట్టబెడుతూ కేంద్రం ఒక దుర్మార్గమైన ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. పార్లమెంటులో దీనిపై బిల్లు పెడితే వ్యతిరేకించాలని కోరుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇదివరకే ప్రతిపక్షాల నేతలను కలిసి విన్నవించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో కాంగ్రెస్‌ కూడా తన వైఖరేమిటో చెప్పాలని ఆప్‌ డిమాండ్‌ చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ తాను ఢిల్లీ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకమని స్పష్టం చేసింది.
బెంగళూరు సమాశానికి సర్వం సిద్ధం
కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ బిజెపిని ఓడించడమే లక్ష్యంగా దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఒక్కటొక్కటిగా జట్టు కడుతున్నాయి. బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ నేతృత్వంలో పాట్నాలో గత జూన్‌ 23న తొలిసారి సమావేశమైన ప్రతిపక్షాల పార్టీల నేతలు మలి విడతలో భాగంగా బెంగళూరులో రెండు రోజుల పాటు (సోమవారం, మంగళవారం) సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి మొత్తం 24 పార్టీలకు చెందిన అధినేతలు, ప్రతినిధులు హాజరయ్యే అవకాశముంది. బెంగళూరులోని తాజ్‌ వెస్ట్‌ ఎండ్‌ హోటల్‌ దీనికి వేదికగా నిలవనుంది. ఆదివారం రాత్రి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి రణదీప్‌ సూర్జేవాలా, రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వరన్‌ అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. పాట్నాలో జరిగిన తొలి సమావేశంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని ఓడించి తీరాలని ప్రతిపక్షాల నేతలు తీర్మానించిన సంగతి తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు ఎత్తుగడలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, మాజీ అధినేత్రి సోనియా గాంధీ, సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. ప్రతిపక్షాల పార్టీల నాయకుల కోసం సోమవారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరవుతున్నట్టు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ,శివసేన (యుబిటి) నాయకులు ఉద్ధవ్‌ థాకరే, సంజరు రౌత్‌, ఆదిత్య థాకరే, బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌, ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సిపిఎం నేత సీతారాం ఏచూరి, సిపిఐ నేత డి రాజా, అలాగే డిఎంకె, సమాజ్‌వాదీ పార్టీ, ఎన్‌సిపితో పాటు మరుమలార్చి ద్రవిడ మున్నెట్ర కఝగం (ఎండిఎంకె), కొంగు దశ మక్కల్‌ కచ్చి (కెడిఎంకె), విదుథులై చిరుథైగల్‌ కచ్చి (విసికె), రెవల్యూషనరీ సోషలిస్ట్‌ పార్టీ (ఆర్‌ఎస్‌పి), ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌, ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ (ఐయుఎంఎల్‌), కేరళ కాంగ్రెస్‌ (జోసెఫ్‌), కేరళ కాంగ్రెస్‌ (మణి) తదితర పక్షాల నేతలు హాజరుఎకానున్నారు.
కాంగ్రెస్‌ సలహా బృందం
ప్రస్తుతం దేశానికి ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అవసరం లేదని కాంగ్రెస్‌ సలహా కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. వ్యక్తిగత చట్టాల సంస్కరణలకు అవకాశం ఉన్నప్పుడు యుసిసి అవసరం లేదని తెలిపింది. యూసీసీ పై సలహా ఇవ్వడం కోసం ఎనిమిది సభ్యులతో సలహా బృందాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో శనివారం ఈ బృందం అంతర్గత సమావేశమయింది. ఈ సమావేశంలో అత్యధిక మంది యూసీసీ అవసరంలేదని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. అలాగే కేంద్రం డ్రాఫ్ట్‌ ముసాయిదా విడుదల చేసే వరకూ కాంగ్రెస్‌ పార్టీ యూసీసీ పై వైఖరి వెల్లడించకూడదనే అభిప్రాయాన్ని బృందం వ్యక్తం చేసినట్లు తెలిసింది.ఈ బృందంలో పి.చిదంబరం, అభిషేక్‌ సంఘ్వి, సల్మాన్‌ ఖుర్షీద్‌, మనీష్‌ తివారీ, వివెక్‌ తంక, కెటిఎస్‌ తుస్లి తదితరులు ఉన్నారు.
బీజేపీ ప్రమాదాన్ని తక్కువగా చూడొద్దు..
తెలంగాణలో కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత పట్టు సంపాదించాలని బీజేపీ శతవిధాల ప్రయత్నం చేస్తున్నదన్నారు. ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులను రాబట్టి బలపడాలని చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయన్నారు. క్షేత్ర స్థాయిలో బీజేపీ ప్రమాదాన్ని తక్కువ అంచనా వేయోద్దని చెప్పారు. సైద్దాంతికంగా రాజకీయంగా ఎన్నికల రంగంలోనూ బీజేపీ, సంఫ్‌ుపరివారాన్ని నిరంతరం ఎదుర్కొవాల్సిందేనని
తేల్చిచెప్పారు. ప్రారంభమైన సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలు ఆదివారం ముగిసాయి. ఈ సందర్భంగా బీవీ రాఘవులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే ద్రవ్యోల్బణం 4.8 శాతానికి చేరిందన్నారు. కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు, పాలు, పండ్ల ధరలు విపరీతంగా పెరిగాయనీ, టమాటా ధర రూ.150కి చేరిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలకి టమాటా ధరే ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పారు. ధరల స్థిరీకరణ కోసం అన్ని రాష్ట్రాలకు డబ్బు కేటాయించి, సబ్సిడీపై నిత్యవసర వస్తువులు సరఫరా చేయాలని సూచించారు. టోకు వ్యాపారులకు కనక వర్షం కురిపించడం కోసమే మోడీ సర్కారు ధరల నియంత్రణ చర్యలు చేపట్టట్లేదని విమర్శించారు.
ఎన్నికల్లో లబ్దిపొందేందుకే ఉమ్మడి పౌరస్మృతి..
తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో లబ్ది పొందే ఉద్దేశ్యంతోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లా కమిషన్‌ ముందు పెట్టిన ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అంశంపై చర్చను లేవదీసిందని విశ్లేషించారు. దీనికి ప్రధాని నరేంద్రమోడీనే స్వయంగా సారధ్యం వహిస్తున్నారని తెలిపారు. ఈ చర్యను సమర్థించుకొనేలా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, సంఫ్‌ుపరివార్‌ దుర్మార్గమైన ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయనీ, వాటికి ప్రజాక్షేత్రంలోనే అడ్డుకట్ట వేయాల్సి ఉందని స్పష్టం చేశారు. యూసీసీపై ఇప్పటి వరకు కేంద్రం ఒక నివేదికను రూపొందించి చర్చకు పెట్టలేదనీ, కేవలం ఊహాగానాలతో ప్రజల మధ్య చర్చను జరుపుతున్నదని అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం మెజార్టీ మతస్తుల ఓట్లను రాబట్టుకోవాలనేదే బీజేపీ తాపత్రయమని విశ్లేషించారు.
మణిపూర్‌లో మంటలు రాజేసింది సంఫ్‌పరివారమే..
మణిపూర్‌లో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి, విధ్వంసాన్ని సృష్టించడంలో సంఫ్‌ుపరివార్‌ పాత్ర ప్రధానమైందని విమర్శించారు. అక్కడి మైటీ, కుకీ తెగల మధ్య మతం ప్రాతిపదికన విద్వేష బీజాలను సంఫ్‌ుపరివార్‌ శక్తులు చాలా కాలం నుంచి నాటుతున్నా యని తెలిపారు. ఆ రాష్ట్రంలో అధికారం లోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్‌ సమస్యను సక్ర మంగా పరిష్కరిం చకుండా, వివాద స్పదం చేసి, ఘర్షణ వాతా వరణం తలెత్తటానికి కారణ మైందని వివరించారు. మణి పూర్‌లో హింసాకాండను అరికట్ట డంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా విఫలమయ్యాయ న్నారు. తీవ్రంగా ప్రాణ, ఆస్తి నష్టాలు జరుగుతున్నా ప్రధాని నరేంద్ర మోడీ చూసీ చూడనట్టు మౌనంగా ఉండటాన్ని ఆయన తప్పుపట్టారు. ఇది పాలనా సమర్థత ఎంతమాత్రం కాదని తేల్చిచెప్పారు. ఈ పరిణామాల దుష్ప్రభావం భవిష్యత్‌లో ఈశాన్య రాష్ట్రా లపై పడే అవకాశం ఉందని అన్నారు.
వైషమ్యాలు సృష్టించి..
దేశంలో ఎక్కడోదగ్గర వైషమ్యాలు సృష్టించి, ప్రజల దృష్టిని మళ్లించి, దొడ్డితోవన విద్యుత్‌ చార్జీలు పెంచడం, మోటార్లకు మీటర్లు బిగించడం, కరెంటుకు పగలు ఒక చార్జి, రాత్రి మరొక చార్జి అంటూ సంస్కరణల పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. పట్టణ సంస్కరణల పేరుతో రాష్ట్రాల్లో నీరు, చెత్త, మురుగుపారుదల వంటి వాటిపై యూజర్‌ చార్జీలు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఆస్తి పన్ను పెంచేందుకు బిల్డింగ్‌ రూల్స్‌, భూ వినియోగ నిబంధనలను నిర్మాణ కంపెనీలకు అనుకూలంగా మారుస్తున్నారనీ, మురికి వాడల అభివృద్ధి పేరుతో బిల్డర్స్‌కు భూమిలో వాటా కల్పించాలనే షరతులు విధిస్తున్నారని చెప్పారు. ఈ నిబంధ నలకు అంగీకరించక పోతే కేంద్రం నుంచి నిధులు ఇవ్వబోమని షరతులు విధిస్తు న్నారని వివరించారు. సరళీకరణ విధానా లను రాష్ట్రాల మీద రుద్దడంలో బీజేపీ ప్రభుత్వం ప్రయివేటు సంస్థలను ఆయా రంగాల్లోకి ప్రవేశ పెట్టాలనే దురుద్దేశ్యం ఇమిడి ఉందన్నారు. ఇది ప్రజా స్వామ్యం, ఫెడరిలిజం, సామాజిక న్యాయానికి హానీ కలిగించే తప్పుడు విధానాలని స్పష్టం చేశారు.
బీజేపీని ఓడించటమే సీపీఐ(ఎం) లక్ష్యం
రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించటం సీపీఐ(ఎం) ముఖ్యమైన కర్తవ్యంగా నిర్దేశించుకుందని తెలిపారు. దానికోసం భావసారూప్యత కల్గిన రాజకీయ శక్తులను సమీకరించటానికి కృషి చేస్తున్నామన్నారు. ఆయా రాష్ట్రాల్లోని వైవిధ్య పరిస్థితులను బట్టి, రాజకీయ విధానాన్ని నిర్ణయించుకుంటామన్నారు. బీజేపీని ఓడించటం కోసం కేంద్ర స్థాయిలో ఒక కూటమి ఏర్పడాలనేది కొందరి ఆకాంక్ష అనీ, అది మంచిదే అయినా ఆయా రాష్ట్రాల్లోని వైవిధ్య పరిస్థితుల రీత్యా సాద్యం కాదనేది తమపార్టీ అంచనా అని తెలిపారు. అందుకే బీజేపీ లబ్దిపొందకుండా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ప్రతిపక్ష రాజకీయ శక్తులు కలిసి పనిచేయాలని తాము భావిస్తున్నామని వివరించారు. ఇటీవల పాట్నాలో బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలో ఏర్పడిన రాజకీయ కూటమి సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీలు తమ మధ్య విబేధాలను వదిలి బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశాయన్నారు. రాజకీయంగా బీజేపీని ఓడించగలమనే విశ్వానానికి ఇదో ముందడుగు అని విశ్లేషించారు.

Spread the love