రోగ నిరోధక వ్యవస్థను పెంచుకోవాలి

– ట్రాన్స్‌ప్లాంట్‌ ఇమ్యూనాలజీ పై సదస్సులో : నిమ్స్‌ డైర్టెర్‌ డాక్టర్‌ నగరి భీరప్ప
నవతెలంగాణ-సిటీబ్యూరో
శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను పెంచుకుంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిమ్స్‌ డైరక్టర్‌ డాక్టర్‌ నగరి భీరప్ప అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని నిమ్స్‌ అస్పత్రిలో హైదరాబాద్‌ నెప్రాలజీ ఫోరం ఆధ్వర్యంలో ‘ట్రాన్స్‌ప్లాంట్‌ ఇమ్యూనాలజీ’ పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో డైరెక్టర్‌ భీరప్ప ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మనిషికి ఏదైనా రోగం వస్తే రోగ నిరోధక శక్తి వెంటనే స్పందింస్తుందన్నారు. హాని కలిగించే వైరస్‌లు శరీరంలోకి ప్రవేశిస్తే రోగ నిరోధకాలు వేగంగా విడుదలై వాటిపై పోరాడతాయని తెలిపారు. నగర జీవన విధానంలో మార్పులు ఉంటున్నాయని, వ్యాపారం, ఉద్యోగమని సమయానికి నాణ్యమైన ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారన్నారు. జీవన విధానంలో మార్పులు చేసుకొని, ప్రతి ఒక్కరూ ఆహార నియమాలను పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని సూచించారు. నిమ్స్‌ నెప్రాలజిస్ట్‌ డా||స్వర్ణలత మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న సాంకేతికతతో వైద్య విధానంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు. కిడ్నీల మార్పిడి వేగవంతంగా పూర్తవుతుందని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో సీఎం కార్యాలయ ఓఎస్డీ డాక్టర్‌ గంగాధర్‌, నెప్రాలజీ ప్రొఫెసర్‌ భూషణ్‌ రాజ్‌, ప్రముఖ వైద్యులు సీరాపాణి గోపాలుని, అనురాధ రామన్‌, మంజూష, కిరణ్మయి, నీరజ, గిరీష్‌ నారాయణ్‌, విజరు కుమార్‌, రాజేశ్వరి, కేవీ దక్షణాముర్తి, జ్యోస్త్న, అనిల్‌, ప్రదీప్‌ దేశ్‌ పాండే, రాజశేఖర్‌ చక్రవర్తి, శ్రీకాంత్‌, శృతి టపియవాల, కృష్ణన్‌, రమేశ్‌, ధనలక్ష్మి, ఫిరోజ్‌ అజీజ్‌, కమల్‌ కిరణ్‌, ఉర్మిళ, శ్రీధర్‌, అంకిత్‌, కృష్ణ మోహన్‌, శశికిరణ్‌, కార్తీక్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love