విషం కక్కిన మోడీ మంత్రి శ్రీనివాసగౌడ్‌

నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్‌
వరంగల్‌ సభలో ప్రధాని మోడీ.. తెలంగాణపై మరోసారి విషం కక్కారని రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస గౌడ్‌ వ్యాఖ్యానించారు. విభజన హామీలను నెరవేర్చని ఆయన ఓ విశ్వాస ఘాతుకుడని విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని బీఆర్‌ ఎస్‌ శాసనసభాపక్ష కార్యాలయంలో ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్‌, అంజ య్యలతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. గతంలో తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఆంధ్రా లో కలిపిన బీజేపీ… ఇప్పుడు ఖాజీ పేటలో కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయ కుండా ఒక చిన్న రిపేరు కంపెనీని పెడతామంటూ చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో అసలు ఆ పార్టీ పాత్రేంటని ప్రశ్నిం చారు. అద్వానీ, వెంకయ్య నాయుడు లాంటి అగ్రనేతల చరిత్రను తొక్కి పట్టింది మోడీయేనని విమర్శించారు.

Spread the love