ప్రతాప్ రెడ్డి సేవలు అభినందనీయం: విజయ్ కుమార్

నవతెలంగాణ – పెద్దవంగర
సుధీర్ఘ కాలంగా విద్యార్థుల ఔన్నతి కోసం పాటుపడిన  పాకనాటి ప్రతాప్ రెడ్డి సేవలు అభినందనీయమని చిట్యాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు విజయ్ కుమార్, టీపీటీఎఫ్ మండల అధ్యక్షుడు చిక్కాల సతీష్, టీఎస్ యూటీఎఫ్ మండల అధ్యక్షుడు గుర్రం శేఖర్ అన్నారు. చిన్నవంగర ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ మంగళవారం ఆయన పదవీ విరమణ చేయగా, అభినందన సన్మాన కార్యక్రమానికి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..గత 33 సంవత్సరాలుగా వృతి నే దైవంగా భావిస్తూ, అంకిత భావంతో పనిచేస్తూ ఎందరో విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్ది నేడు పదవి విరమణ పొందుతున్న ప్రతాప్ రెడ్డి సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ సహజం అన్నారు. ఉపాధ్యాయులు విధుల నిర్వహణలో అంకిత భావంతో పని చేసినప్పుడే సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్ కు బాటలు వేసేందుకు ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలన్నారు. ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. పుట్టిన గడ్డ పై విధులు నిర్వర్తిస్తూ, పదవీవిరమణ చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ అసిస్టెంట్ సెక్రటరీ కస్తూరి నరేష్, పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు సోమారపు ఐలయ్య, సోమయ్య, ప్రభాకర్ రెడ్డి, వెంకన్న, జనార్ధన్, ఆంజనేయులు, మురళీ, మధుసూదన్, రంజిత్, భీమ నాయక్, వెంకటేశ్వర్లు, ప్రకాష్, నాగమణి, కవిత, శ్రీనివాస్, అజయ్, యాకుబ్ రెడ్డి, రాయలు, సీఆర్పీలు సంతోష్, రంగన్న, పల్లవి పాల్గొన్నారు.
Spread the love