రైతులు వేసవిలో దుక్కులు దున్నుకోవలి: ప్రవీణ్ 

నవతెలంగాణ – నెల్లికుదురు
వానకాలం, యాసంగి పంటల తర్వాత తిరిగి వర్షాకాలం వచ్చే వరకు చాలా మంది రైతులు అవగాహన లేమితో భూమిని దున్నకుండా అలాగే వదిలేస్తారు. దీంతో కలుపు మొక్కలు పెరిగి భూమిలోని నీటిని, పోషక పదార్ధాలను గ్రహించి భూమికి బలం (సత్తువ) లేకుండా చేస్తాయి. ఇదే వేసవిలో లోతు దుక్కులతో రైతన్నకు లాభాలు మెండుగా వస్తాయి. వేసవి లోతు దుక్కులతో భూమి పై పొరలు కిందికి, కింది పొరలు పైకి తిరగబడి నేల సారవంతంగా వృద్ధి చెందుతుంది. కలుపు యాజమాన్య ప్రక్రియ వేసవికాలం నుంచే చేపడితే కలుపు మందులను ఆశ్రయిం చకుండా రైతులు ప్రత్యామ్నాయ పద్ధతులపై దృష్టి సారించడానికి వీలు కలుగుతుంది. అంతే కాకండా భూమిని లోతు దుక్కులు దున్నడం వల్ల మిగిపోయిన కలుపు మొక్కలను పూర్తిగా నాశనంచేయవచ్చు. పంటలు పూర్తి అయిన తర్వాత మిగిలినకలుపు మొక్కలు తొలకరి వర్షాలకు అధికంగా విత్తనోత్పత్తి చేసుకుంటాయి. అందువల్ల వేసవిలో తప్పనిసరిగా లొతు దుక్కులు దున్నాలి. ఇలాంటి దుక్కులవలన భూమిలో ఉన్న కీటకాల గుడ్లు, లార్వాలు చనిపోవడంతో పాటు గడ్డిజాతులు అయిన తుంగ,గరికను అరికట్టవచ్చు. భూమిలోని పోషకాలు కూడాపెరగడంతో పాటు పంట దిగుబడి భాగా వస్తుంది.లోతు దుక్కులు నెలను చదును చేసే పనులే కాకుండా వేసవిలో వచ్చే జల్లులు, తొలకరి వర్షాలకు ఉపయోగించుకుని నేల అవసరాన్ని బట్టి పైపొరల్లోనికలుపు విత్తనాలు చాలా వరకు మొలక దశలోనే అంతరించిపోతాయి. అలాగే వాలుకు అడ్డంగా దున్నుకుంటే వర్షాలు కురిసినప్పుడు నీరు భూమి లోపలికి ఇంకుతుంది. నీటినిల్వ శక్తి పెరుగుతుంది. రైతులు వేసవిలో కురిసే వర్షాలకు లోతు దుక్కులు దున్నుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.బుధవారం నెల్లికుదురు మండలం నెల్లికుదురు గ్రామ శివారు లో రైతులు ట్రాక్టరుతో లోతైన దుక్కులు దున్నడం పరిశీలించి వ్యవసాయ విస్తరణ అధికారి వల్లంల ప్రవీణ్ వేసవి లోతు దుక్కుల వలన కలిగే లాభాలను వివరించారు.
దున్నకపోతే నష్టాలే..
యాసంగి పంటల కోతల తర్వాత చాలా మంది రైతు లు భూమిని అలాగే వదిలేస్తారు. దీంతో ఖాళీ భూ ముల్లో కలుపు మొక్కలు, ఇతర గడ్డిజాతి మొక్కలు పె రుగుతాయి. ఇవి భూమిలోని నీటిని, పోషక పదార్ధా లను గ్రహించి భూమికి సత్తువ లేకుండా చేసి, భూ సారాన్ని తగ్గిస్తాయి. భూమి లోపలి పొరల్లోని నీరు ఆవిరైపోతుంది. వేసవి దుక్కులు లేకుంటే తొలకరి వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా పోతుంది. వ ర్షాలతో భూమి కోతకు గురవుతుంది. ఖాళీ భూము ల్లో చీడపురుగుల భారీగా వృద్ధి చెందుతాయి. ఫలితంగా రాబోయే పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది.
వేసవి దుక్కులే కీలకం..
వర్షాకాలం సాగుకు నెల రోజుల ముందు నుంచే ప టచేలను చదును చేసి దుక్కులు దున్ని తొలకరికి ముందే విత్తుకోవడానికి సిద్ధం చేసుకోవాలి. పంటకో తల అనంతరం భూమిని వృధాగా వదిలి వేయకుం డా లోతుగా దుక్కి దున్నితే పంటలను ఆశించే చీడ, పీడలను నివారించవచ్చు. అంతే కాకుండా వానలు కురిస్తే నీరు భూమి లోపలి వరకు చేరుతుంది. మొద టిసారి దుక్కులు దున్నిన తర్వాత రెండోసారి దున్నే ముందు పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు లేదా చెరువు మట్టిని పొలంలో వెదజల్లితే పంట దిగుబడి సామర్ధ్యం పెరుగుతుంది.
Spread the love