రాజ్ గోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావాలని పూజలు

నవతెలంగాణ – చండూరు కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపొందిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావాలని కస్తాల గ్రామ కాంగ్రెస్ పార్టీ, మిత్రపక్షాల ఆధ్వర్యంలో చండూరు కోపరేటివ్ బ్యాంకు డైరెక్టర్ కట్ట భిక్షం శ్రీ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో 101 కొబ్బరికాయలు కుట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి పదవి వస్తే నియోజకవర్గం అంతా అభివృద్ధి చెందుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో కస్తాల ఎంపీటీసీ నాతాల వనజ విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ బొమ్మరబోయిన సైదులు ప్రేమలత, మేకల మమతా సాగర్ రెడ్డి, పంగా రామకృష్ణ పాల్గొన్నారు.

Spread the love