పరకాల బిట్స్ పాఠశాలలో ముందస్తుగా సంక్రాంతి వేడుకలు

నవతెలంగాణ -పరకాల : బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ లో అంగరంగ వైభవంగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విద్యార్థులు ముగ్గుల ప్రదర్శన నిర్వహించారు. రంగురంగుల ముగ్గులతో పాఠశాల ప్రాంగణమంతా సంక్రాంతి వాతావరణాన్ని తలపించేలా అందరు అలంకరించారు గంగిరెద్దు హరిదాసులు గాలిపటాలు గ్రామీణ నేపథ్యాన్ని తలపించేలా అలంకరించారు. సంస్కృతిక కార్యక్రమంలో భాగంగా నృత్య ప్రదర్శనలతో విద్యార్థులు అలరించారు. ఇందులో భాగంగా చిన్నారులకు భోగి పళ్ళు పోశారు. మంటలు వేసి పరమాన్నం వండారు. బిట్స్ సంస్థల చైర్మన్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలుగు ప్రాంతంలో జరుపుకునే సంక్రాంతి పండుగ గురించి విద్యార్థులకు తెలియజేసే వారిని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానోపాధ్యాయులు జోసెఫ్ గారు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love