పార్లమెంట్‌కు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము..

నవతెలంగాణ – హైదరాబాద్: 18వ లోక్‌సభ తొలి సమావేశాలు వరుసగా నాలుగోరోజుకు చేరుకున్నాయి. లోక్ సభ సమావేశాలు సోమవారం ప్రారంభం కాగా, నేటి నుంచి రాజ్యసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయసభలను ఉద్దేశించి  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి భవన్‌నుంచి ముర్ము పార్లమెంట్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌లు రాష్ట్రపతికి స్వాగతం పలికారు.

Spread the love