రాజీవ్ కంప్యూటర్స్ అధినేతకు పెండ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిస జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు

నవతెలంగాణ తిరుమలగిరి: తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధి శుభమస్తు ఫంక్షన్ హాల్ లో ఆదివారం రాజీవ్ కంప్యూటర్స్ యజమాని సోమ శ్రీనివాస్- ప్రీతిల 14వ వివాహ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తిరుమలగిరి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమ నరసయ్య హాజరై వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వీరు ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్యులు పిఎసిఎస్ చైర్మన్ పాలెపు చంద్రశేఖర్, ఇమ్మడి బ్రదర్స్, కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుండా భాస్కర్, గజ్జి ఉపేందర్, రాంబాబు, సామ ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, నగేష్, శ్రీనివాస్ తదితర ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Spread the love