తప్పుడు లెక్కలకు చెల్లు.. ధరల పట్టిక విడుదల చేసిన ఈసీ

నవతెలంగాణ – ఢిల్లీ : దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈసారి అభ్యర్థుల ప్రచార ఖర్చుల్లో కచ్చితత్వం కోసం పలు చర్యలు తీసుకుంది. తప్పుడు లెక్కలతో ప్రచార వ్యయాన్ని తగ్గించి చూపే అవకాశం లేకుండా ధరల జాబితా విడుదల చేసింది. ఇందులో పేర్కొన్న ధరల ప్రకారమే అభ్యర్థి తన ఖర్చుల లెక్కలు చూపించాలని పేర్కొంది. ఈ ఖర్చు రూ.40 లక్షలకు మించకూడదని తెలిపింది. ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితాలో ధరలు ఇలా ఉన్నాయి..
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసే సభలలో వేటికి ఎంత.. (రోజుకు)
ఫంక్షన్‌ హాల్‌ రూ.15,000
భారీ బెలూన్‌ రూ. 4,000
ఎల్‌ఈడీ తెర రూ.15,000
డీసీఎం వ్యాన్‌ రూ. 3,000
మినీ బస్సు రూ.3,500, పెద్ద బస్సు రూ.6,000
ఇన్నోవా రూ. 6,000
డ్రోన్‌ కెమెరా రూ.5,000
పెద్ద సమోసా రూ.10
లీటర్‌ వాటర్‌ బాటిల్‌ రూ.20
పులిహౌర రూ.30 (గ్రామీణ ప్రాంతంలో రూ.20)
టిఫిన్‌ రూ.35 (గ్రామీణ ప్రాంతంలో రూ.30)
సాదా భోజనం రూ.80
వెజిటబుల్‌ బిర్యానీ రూ.80 (గ్రామాల్లో రూ.70)
చికెన్‌ బిర్యానీ రూ.140 (గ్రామాల్లో రూ.100)
మటన్‌ బిర్యానీ రూ.180 (గ్రామీణ ప్రాంతంలో రూ.150)

Spread the love