రైతుల అవసరాల కోసమే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం

– రైతుల కోరిక మేరకే విత్తనాలు మందులు తీసుకువస్తాం సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్

నవతెలంగాణ-  మద్నూర్:
ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం రైతుల అవసరాల కోసమే కొనసాగుతుందని రైతుల కోరిక మేరకే విత్తనాలు ఎరువులు తీసుకురావడం జరుగుతుందని సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ రైతులకు హామీ ఇచ్చారు.  మద్నూర్ సింగిల్ విండో 53వ మహాజనసభ చైర్మన్ అధ్యక్షతన శుక్రవారం సంఘ భవనంలో జరిగింది ఈ మహాజనసభలో వ్యవసాయదారులు వచ్చే రబ్బి సాగు కోసం స్టిక్ డిఏపి అందుబాటులో ఉండేలా చూడాలని శనగ విత్తనాలు రైతులు తెలిపిన కంపెనీ విత్తనాలే తీసుకురావాలని కోరడం జరిగింది. రైతుల కోరిక మేరకే రబ్బి పంటల సాగు కోసం విత్తనాలు ఎరువులు సరైన వాటిని తీసుకువస్తామని చైర్మన్ రైతులకు హామీ ఇచ్చారు సింగిల్ విండో కార్యనిర్వాహణ అధికారి జే బాబురావు సంఘం ఖర్చు ఆదాయం వివరాలను చదివి వినిపించారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ శంకర్రావు సింగిల్ విండో పాలకవర్గం సభ్యులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Spread the love