ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీల హక్కులు కాలరాసేందుకు కాంగ్రెస్‌ కుట్ర : ప్రధాని మోడీ

లక్నో: దేశంలోని ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీల హక్కులను కాలరాసే కుట్రకు కాంగ్రెస్‌ పార్టీ తెరలేపిందని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఆరోపించారు. యూపీలోని ఆగ్రాలో జరిగిన ర్యాలీ నుద్దేశించి మోడీ మాట్లా డారు. కర్నాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓబీసీల హక్కులను లాగేసుకుం దని, ఆపై దేశవ్యాప్తంగా ఎక్కడ అధికారంలోకి వచ్చినా ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీ లను వంచించేందుకు అలాగే చేయాలని భావిస్తోం దని ఆరోపిం చారు. కర్నాటకలో ముస్లింలం దరినీ ఓబీసీ జాబితాలో చేర్చుతూ అక్కడి కాంగ్రెస్‌ ప్రభు త్వం రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఓబీసీల హక్కులను కాంగ్రెస్‌ కాలరాసిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యూపీలోనూ ఈ క్రీడను రక్తికట్టించేందుకు కాంగ్రెస్‌ పావులు కదుపు తోందని దుయ్యబట్టారు. దేశంలో ఎక్కడ అవకాశం వచ్చినా కాంగ్రెస్‌ ఈ పనికి తెగ బడుతుందని అన్నారు. దొడ్డిదారిన ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు కోతలు పెట్టి దాన్ని ఇతరులకు బీజేపీ అందిస్తోందని ఆరోపించారు.

Spread the love