పులులు, సింహాలు, చిరుతలు, మంచు చిరుతలకు తోడు చీతాలు సైతం పెరుగుతున్న ఏకైక దేశంగా ఇండియా అరుదైన ఘనత సాధించింది. వాటి ఉనికి మాత్రమే కాదు! గతంలో పోలిస్తే వాటి సంఖ్యలో పెరుగుదల సరికొత్త మార్పును సూచిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కొన్ని దేశాలు మాత్రమే అందుకోగల ఒక మైలురాయిని భారతదేశం సాధించిందని చెప్తున్నారు. నిరంతర పరిరక్షణ ప్రయత్నాల ద్వారా ఇది సాధ్యమైందని భావిస్తున్నారు. 1952లో భారతదేశంలో ఈ జాతి అంతరించిపోయినట్లు ప్రకటించారు. దీంతో దేశీయ చిరుతల సంఖ్యను కోల్పోయిన ఏకైక దేశంగా భారతదేశం నిలిచింది. 2022లో ‘ప్రాజెక్ట్ చీతా’ ఫలితంగా పునర్వైభవం సాధ్యమైంది. నమీబియా నుంచి ఎనిమిది చీతాలు, ఆ తర్వాత దక్షిణాఫ్రికా నుంచి అదనపు చిరుతలను తరలించారు. వాటి సంతానం ఫలితంగా 2026 నాటికి మొత్తం సంఖ్య 57కి చేరింది. గడ్డిభూముల పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడమే ప్రాజెక్ట్ చీతా లక్ష్యం. తాజా అధికారిక అంచనాల ప్రకారం, భారతదేశంలో పులుల సంఖ్య 3,682, చిరుతల సంఖ్య 13,874, ఆసియా సింహాల సంఖ్య 891కి చేరినట్లు అంచనా, మంచు చిరుతల సంఖ్య 718గా ఉంది.
దేశంలో పులుల పునరుద్ధరణ ప్రపంచంలోని ఓ సరికొత్త చరిత్ర లిఖిస్తోంది. 2006 నాటికి వాటి సంఖ్య 1,411కి పడిపోవడంతో ‘ప్రాజెక్ట్ టైగర్’, జాతీయ పులుల సంరక్షణ అథారిటీ (చీుజA) ద్వారా సంరక్షణ చర్యలు చేపట్టారు. మెరుగైన ఆవాసాల పరిరక్షణ, వేట నిరోధక గస్తీ, కెమెరా-ట్రాప్ పర్యవేక్షణ, శాస్త్రీయ సంఖ్య అంచనా, పులుల ప్రధాన ఆవాసాల నుంచి ప్రజలను ఖాళీ చేయించడం వంటి చర్యలు పురోభివద్ధికి తోడ్పడ్డాయి. ఈ నేపథ్యంలో 2022 నాటికి, పులుల సంఖ్య 3,682కి పెరిగింది. ఇది దాదాపు 161శాతం పెరుగుదలను నమోదు చేయగా ప్రపంచంలోని వన్యపులుల్లో దాదాపు 70శాతం భారతదేశంలోనే ఉండడం విశేషం.
ఒకప్పుడు గుజరాత్‌లోని గిర్ పర్వత శ్రేణిలోని ఒక చిన్న ప్రాంతానికే పరిమితమైన ఆసియా సింహం అద్భుతంగా కోలుకుంది. ఆవాసాల రక్షణ, పశువైద్య సంరక్షణతో పాటు సామాజిక భాగస్వామ్యంతో మనుగడ సాగిస్తున్నాయి. 2000లో 327గా ఉన్న వాటి సంఖ్య 2025 నాటికి 891కి చేరినట్లు అంచనా. అడవుల సంరక్షణ, పులి సంరక్షణ కేంద్రాలకు బలమైన రక్షణ కల్పించడం వల్ల చిరుతపులులూ ప్రయోజనం పొందాయి. 2014లో చిరుతల సంఖ్య 7,910 కాగా, 2022 నాటికి 13,874కు పెరిగాయి. మెరుగైన ఆవాసాల నిర్వహణ, ఆహారం లభ్యత పెరగడం వల్ల ఈ పెరుగుదల సాధ్యమైందని నిపుణులు పేర్కొంటున్నారు.
ప్రాజెక్ట్ చీతా
- Advertisement -
- Advertisement -


