Sunday, July 19, 2026
E-PAPER
Homeఆటలుముగిసిన హైదరాబాద్ సెయిలింగ్ పోటీలు

ముగిసిన హైదరాబాద్ సెయిలింగ్ పోటీలు

- Advertisement -

వారంపాటు పోటీపడిన 124 మంది సెయిలర్లు
నవతెలంగాణ-హైదరాబాద్

తొలి ఐసీఎల్ఏ ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ సెయిలింగ్‌, 40వ హైదరాబాద్ సెయిలింగ్‌ వీక్ పోటీలు శనివారం ఘనంగా ముగిశాయి. హుస్సేన్ సాగర్ లోని సెయిలింగ్‌ క్లబ్ లో జరిగిన ముగింపు వేడుకలకు లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్షణే ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈమ్ఈఎస్ఈ ఎంతో మంది ఒలింపియన్లను, అర్జున అవార్డీలను, గొప్ప సెయిలర్లని తయారు చేసింది. ఈ ఆటలో నాయకత్వం, సహనం, క్రమశిక్షణ అలవడతాయి. సముద్రం దాటాలి అంటే ముందు ఓడ్డు విడిచి పెట్టాలని’ అన్నారు. ఏ పోటీల్లో 124 మంది సెయిలర్లు పోటీపడగా అందులో 19 మంది మహిళా, బాలికలు ఉన్నారు. దేశవ్యాప్తంగా 19 సెయిలింగ్‌ క్లబ్బులు హాజరయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -