నవతెలంగాణ- డిచ్ పల్లి: ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ ప్లే గ్రౌండ్లో జరిగిన హైదరాబాద్ రీజినల్ లెవెల్ (తెలంగాణ & ఆంధ్రప్రదేశ్) ఎంఎల్ బి (బేస్ బాల్) కప్ పోటీలలో తెలంగాణ స్ట్రైకర్స్ జట్టులో పాల్గొని జట్టు విజయానికి కృషిచేసిన డిచ్ పల్లి మండలం లోని మిట్టపల్లి క్రీడాకారులు కె కిషోర్, ఈ శ్రీశాంత్ లకు ఎంఎల్ బి కాప్ ఇండియా ఇంచార్జీ డేవిడ్ (అమెరికా) చేతుల మీదుగా ట్రోపీని అందుకున్నారు. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పంజాబ్ రాష్ట్రం లో జరిగే జాతీయ ఎంఎల్బి కప్ పోటీలకు ఎంపికైన సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుశీల్ కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు మర్కంటి గంగా మోహన్, ఉపాధ్యాయ బృందం రాఘవేందర్ రావు, రాజశేఖర్, పోశెట్టి, బాల్ రాజ్, నిరంజన్, శ్రీధర్ పాఠశాల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.