పరుల పాలవుతున్న పొట్లి మహారాజ్‌ దేవాలయ ఆస్తులు

– అన్యక్రాంతమవుతున్న దేవాదాయశాఖ ఆస్తులు
– దేవస్థానం ఆస్తులపై కన్నేసిన కృష్ణవేణి కాన్సెప్ట్‌ పాఠశాల యాజమాన్యం
– లీజు పొడిగించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు
– మున్సిపల్‌, దేవాదాయశాఖ అనుమతులు లేకుండానే పాఠశాల భవన నిర్మాణాలు
– మామూళ్ల మత్తులో అధికార యంత్రాంగం
లోకాయుక్తను ఆశ్రయించిన భక్తులు
నవతెలంగాణ-తాండూరు
దేవాదాయశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆలయ భూములతో పాటు ఆస్తులు సైతం అన్యక్రాం తమవు తున్నాయి. తాండూరు పట్టణ కేంద్రంలో ప్రసిద్ధి చెందిన శ్రీ సద్గురు పొట్లి మహారాజ్‌ దేవస్థానం ఆలయ ఆస్తులు అన్య క్రాంతమవుతున్నాయి. పొట్టి మహారాజ్‌ దేవస్థానం ఆలయ ఆస్తులపై రాజకీయ నాయకులు చాలా ఏళ్లుగా కన్నేసి ఆల య ప్రాంగణంలో ఉన్న కృష్ణవేణి కాన్సెప్ట్‌ పాఠశాల లీజు పొడిగించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పట్ట ణ కేంద్రంలోని ఎకరా 20 గుంటల భూమిలో పొట్టి మహా రాజ్‌ దేవస్థానం ఉంది. అందులో కృష్ణవేణి కాన్సెప్ట్‌ పాఠశా ల ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా యథేచ్భగా కొనసా గిస్తూ ఉన్నారు. మున్సిపల్‌ దేవాదాయశాఖ అనుమతులు లేకుండానే భవనాలు నిర్మాణం చేశారు. దేవస్థానం భూ ములు కృష్ణవేణి కాన్సెప్ట్‌ పాఠశాల 16 ఏండ్లు రెంట్లు చెల్లి స్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాఠశాల వాడు కుంటున్న స్థలానికి సుమారు రూ.లక్ష 75 వేలు రెంట్లు రావాలి కానీ కేవలం ఎన్ని, 500 మాత్రమే చెల్లిస్తున్నారు. రూ.16 వేల ఎస్‌ఎఫ్టి స్థలాన్ని కృష్ణవేణి కాన్సెప్ట్‌ పాఠశాల వాడుకుంటుంది. 2000 ఎస్‌ఎఫ్‌టి స్థలాన్ని గ్రౌండ్‌ కోసం వాడుకుంటుంది. దేవాలయానికి 40 షాపులున్నా యి. అందరూ నామమాత్రపు రెట్లు చెల్లిస్తున్నారు. పాఠశాల నిర్వాహకులు దేవస్థానానికి మూడు లక్షల దగ్గర అద్దె చెల్లించాల్సి ఉంటుంది. కానీ నామమాత్రపు అద్దె చెల్లిస్తూ కొనసాగిస్తున్నారని అధికారులు అంటున్నారు. ఫైర్‌ అనుమతి లేకుండానే పాఠశాల నడిపించేందుకు విద్యాశాఖ అధికారులు ఎలా అనుమతులు ఇస్తారని పాలకమండలి ప్రశ్నిస్తుంది. విషయంపై దేవాదాయశాఖ కమిషనర్‌కు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామంటున్నారు. దేవాలయ స్థలంలో అక్రమంగా పాఠశాలలు నిర్మించి రాజకీయ ఆర్థిక బలంతో దేవాలయ సొత్తును తమ జీవులు నింపుకుంటు న్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. దేవుని భూమిని వ్యాపా రంగా ఉపయోగించుకొని కృష్ణవేణి కాన్సెప్ట్‌ పాఠశాల యా జమాన్యం లాభాలు అర్జిస్తూ క్రిమినల్‌ కోర్టులో ఉన్న కేసు ను నీరు గాడ్చే ప్రయత్నం చేస్తున్నారని పలువురు విమ ర్శిస్తున్నారు. పాఠశాలలో పార్టనర్‌గా ఉన్న మాజీ మున్సి పల్‌ చైర్మన్‌ తనకు ఉన్న రాజకీయ ఆర్థిక పలుకుబడితో ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నారని విమర్శలు వస్తున్నాయి. అనుమతి లేకుండానే పాఠశాల భవన నిర్మాణం నిర్మి ంచడమే కాకుండా ఖాళీగా ఉన్న స్థలాన్ని ఆక్రమించుకుని వాడుకుంటున్నారని ఆలయ పాలకమండలి ఆరోపిస్తుంది. క్రిమినల్‌ కోర్టులో ఉన్న కేసును ముందుకు సాగనివ్వకుండా పాఠశాల యాజమాన్యం అడ్డు వేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ప్రతిరోజు ఉదయం గుడికి వచ్చే భక్తులకు పాఠశాల యాజమాన్యం ఇబ్బందులకు గు రి చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. పాఠశాల యా జమాన్యం నిర్వాహకులు గుడికి వచ్చే దారిలో బార్కెట్లను ఏర్పాటు చేస్తూ గుడిలో కనీసం గంట కొట్టనీయకుండా మై కులు పెట్టనీయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆలయ ఆస్తులో జరిగిన అక్రమాలపై ఆల య భజన ఉండాలి అధ్యక్షులు ప్రభాకర్‌ మహారాజ్‌ 20 14లో లోకాయుక్తను ఆశ్రయించారు. పొట్టి మహారాజు ఆస్తులను కాపాడాలని కేసు వేశారు. పాఠశాల యాజ మాన్యం ఆర్థిక రాజకీయ బలంతో కేసులను నీరుగారు స్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దేవాదాయ శాఖ నిబంధన ప్రకారం అద్దె చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటాం
దేవాదాయ శాఖ నిబంధన ప్రకారం కిరాయి దారుల అద్దె చెల్లించాల్సి ఉంటుంది.
పొట్లి మహారాజ్‌ దేవాలయం ఆవరణలో నిర్మించిన కృష్ణవేణి కాన్సెప్ట్‌ స్కూల్‌ ఆకులు 8500 మాత్రమే చెల్లిస్తున్నారు.
ప్రస్తుతం పాఠశాల వాడు కుంటున్న స్థలానికి రెండున్నర లక్షలకు పైగా అద్దె చెల్లిం చాల్సి ఉంటుంది.
దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న దుకా ణ సముదాయాలు నామమాత్రపు అద్దెలు చెల్లిస్తున్నారు.
40 దుకాణాలకు 40 వేలు మాత్రమే వస్తుంది. పక్కకున్న ప్రయివేటు దుకాణాలకు ఒక్కొక్కదానికి రూ.10 వేలకు పైగా అద్దె ఉంది. అద్దెలు పెంచే విధంగా చర్యలు తీసుకుం టున్నాం.
ఈవో నరేందర్‌, పొట్లి మారాజ్‌ దేవాలయ ఆలయం
కృష్ణవేణి కాన్సెప్ట్‌ పాఠశాలకు
ఫైర్‌ అనుమతి లేదు
తాండూర్‌ పట్టణ కేంద్రంలో కొనసాగుతున్న కృష్ణవేణి కాన్సెప్ట్‌ పాఠశాలకు ఫైర్‌ అనుమతి లేదు.
2017 నుంచి ఆన్‌లైన్‌ విధానం అమల్లోకి వచ్చింది.
నుండి పాఠశాలకు ఎలాంటి ఫైర్‌ ఎన్‌ఓసి ఇవ్వలేదు.
పూర్తిస్థాయిలో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటాం.
ఎస్‌ఐ నాగార్జున, తాండూరు ఫైర్‌ స్టేషన్‌

Spread the love