కల్యాణలక్ష్మి పథకం ఆడబిడ్డలకు వరం

– మంత్రి సబితా ఇంద్రారెడ్డి
– 72 మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ
నవతెలంగాణ-మహేశ్వరం
పేదింటి ఆడబిడ్డలకు వరం లాంటిది కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం మహేశ్వరం మండల పరి షత్‌ కార్యాలయంలో 72 మంది లబ్దిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు, తుక్కుగూడ మున్సిపాలిటీ సర్దార్‌ నగర్కు చెందిన లబ్దిదారులకు 58,59 జీవో కింద మంజూరైన భూమి హక్కు పత్రాలను జడ్పీ చైర్‌ పర్సన్‌ తీగల అనితా హరినాథ్‌ రెడ్డితో కలిసి ఆమె అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విదంగా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపె ట్టడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ స్థలాలలో నివాసం ఉంటున్న పేద, మధ్య తరగతి ప్రజలకు 58,59 జోవో ఆస్తి హక్కులు కలిపిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కు తుందన్నారు. జూన్‌ 2వ తేదీ నుండి నిర్వహిస్తున్న శతాబ్ది ఉత్సవాలలో ప్రతి ఒక్కరూ పాల్గొన్ని విజయ వంతం చే యాలని ఆమె కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ రఘుమా రెడ్డి, వైస్‌ ఎంపీపీ సునితా ఆంధ్యానాయక్‌, సహకార బ్యాం క్‌ చైర్మన్‌ మంచె పాండు యాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వెంకటే శ్వర్‌రెడ్డి, ఎంపీడీవో నర్సింహులు, తహసీల్దార్‌ మహమూ ద్‌ అలీ, సర్పంచ్లు స్లీవారెడ్డి, సాలీవీరానాయక్‌, మెగావత్‌ రాజునాయక్‌, శివిరాజునాయక్‌, మోతీలాల్‌ నాయక్‌, ముక్కెర యాదయ్య, మద్ది సురేఖకరుణాకర్‌ రెడ్డి, నియో జక వర్గ ఉపాద్యక్షుడు హనుమగల్ల చంద్రయ్య, జిల్లా రైతు సమన్వయ సమితి నాయకుడు కూన యాదయ్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సురసాని సురేందర్రెడ్డి, వైస్‌ చైర్మన్‌ ఆనం దం, మండలాధ్యక్షుడు అంగోతు రాజునాయక్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వర్కల యాదగిరిగౌడ్‌, నియోజక వర్గ కార్యద ర్శి గుండెమోని అంజయ్య ముదిరాజ్‌, కో ఆప్షన్‌ సభ్యుడు సయ్యద్‌ ఆదిల్‌ అలీ నాయకులు బండారు లింగం, మంత్రి రాజేశ్‌ పీఏసీఎస్‌ డైరెక్టర్లు కడమోని ప్రభాకర్‌, పొల్కం బా లయ్య, రాకేశిరెడ్డి ఎస్టీసెల్‌ మండలాధ్యక్షుడు గోపాల్‌ నాయక్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు మాదారం ఆంజనే యులు, రవీందర్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love