పారిశుధ్య కార్మికులను పర్మినెంట్‌ చేయాలి

– లేదంటే ప్రభుత్వాన్ని గద్దె దించుతాం
– రాష్ట్ర మున్సిపల్‌ ఆహ్వాన సంఘం కోశాధికారి వనంపల్లి జైపాల్‌ రెడ్డి పిలుపు
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
రాష్ట్రంలో పారిశుధ్య కార్మికులకు వెంటనే పర్మినెంట్‌ చేయకపోతే సీఎం కేసీఆర్‌ ప్రభుత్వంను గద్దె దించేంత వరకూ పోరాడుతామని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్‌ స్టాఫ్‌ అండ్‌ ఔట్‌ సోర్సింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ఆహ్వాన సంఘం కోశాధికారి వనంపల్లి జైపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం కాటేదాన్‌లో మున్సిపల్‌ స్టాఫ్‌ అండ్‌ ఔట్‌ సోర్సింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర 3వ మహా సభల వాల్‌ పోస్టర్లు ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ వ్యవస్థ ఉండదని అందర్నీ పర్మనెంట్‌ చేస్తానని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా అనేక సందర్భాల్లో చెప్పారని గు ర్తు చేశారు. తెలంగాణలో మున్సిపల్‌ రంగంలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌, ఉద్యోగ కార్మిక సిబ్బం దికి 8గంటల పని విధానం అమలు కావాలని అన్నారు. పర్మినెంట్‌ చేసే వరకు కార్మికులకు కనీస వేతనం రూ. 26వేల వేతనం ఇవ్వాలన్నారు. మే డే సందర్భంగా ఒక వె య్యి రూపాయలు పెంచడం మరీ దారుణమన్నారు. రా ష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీ విడుదల చేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాలయాపన చేస్తు న్నారని మండిపడ్డారు. ఉద్యోగ భద్రత పీిఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యాలు పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఈ కార్య క్రమంలో ఏఐటీయూసీ రాజేంద్రనగర్‌ మండల కార్యదర్శి టి.ఆనంద్‌, శ్రీను, శ్యామలమ్మ, సరస్వతి, పెంటమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Spread the love