పెట్రోల్, డీజిల్ ధరలపై ఆందోళనలు
నవతెలంగాణ- విలేకరులు
పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం కూడా ఆందోళనలు జరిగాయి. భువనగిరి జిల్లా కేంద్రంలోని రైతుబజారు వద్ద సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వలిగొండ మండల కేంద్రంలో సీపీఐ(ఎం), సీపీఐల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఆలేరు పట్టణంలో రైల్వే గేట్ వద్ద సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. చౌటుప్పల్ పట్టణంలో జాతీయ రహదారిపై సీపీఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సీపీఐ ఆధ్వర్యంలో చండూరు, గట్టుప్పల్, మర్రిగూడ, నల్లగొండ పట్టణ కేంద్రంలో నిరసనలు తెలిపారు. దేవరకొండ పట్టణంలోని పల్లా పర్వత్‌రెడ్డి భవన్ నుంచి ఐబీ, కోర్టు, బస్టాండ్ వరకు సీపీఐ ఆధ్వర్యంలో ఆటోకు తాళ్లు కట్టి లాగి నిరసన తెలిపారు. జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. సీపీఐ(ఎం), సీపీఐ, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఆర్.మహిపాల్ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. గండిపేటలో సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఆమనగల్‌లో కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో, జడ్చర్ల పట్టణంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆటోలకు తాడు కట్టి లాగి నిరసన తెలిపారు. వనపర్తి అంబేద్కర్ చౌరస్తాలో సీపీఐ(ఎం) నాయకులు నిరసన చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన చేశారు. గద్వాల జిల్లా కేంద్రంలోని సీపీఐ ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో నాందేవ్‌వాడలో ఆటోకు తాడుగట్టి లాగుతూ నిరసన వ్యక్తం చేశారు.
ఆటోలకు తాళ్లు కట్టి లాగి నిరసన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


