దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై నిరసన ర్యాలీ

నవ తెలంగాణ-గోవిందరావుపేట
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల పై బుధవారం నిరసన ర్యాలీ నిర్వహించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అశోక్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ మీడియాతో మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నందున 22న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆదేశానుసారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ నిరసన కార్యక్రమంలో అన్ని మండలాల అధ్యక్ష కార్యదర్శులు మండల కమిటీలు నాయకులు ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని నిరసన ర్యాలీని జయప్రదం చేయాలని అన్నారు.

Spread the love