ప్రాణాలకు తెగించి వైద్యం అందించి..

నవతెలంగాణ-మంగపేట
భారీ వర్షాల్లో సైతం వైద్య సిబ్బంది ప్రాణాలు పణంగా పెట్టి గిరిజన గ్రామాల ప్రజలకు వైద్యం అందిస్తున్నారు. ములుగు జిల్లా మంగపేట మండలంలోని బ్రాహ్మణపల్లి ఆస్పత్రి వైద్యాధికారి కారం నిఖిల్‌ తన సిబ్బంది బుధవారం కుండపోతగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయక ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులను దాటి ఆస్పత్రి పరిధి దోమెడ గ్రామంలో రాపిడ్‌ ఫీవర్‌ సర్వే నిర్వహించారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు దోమెడలో ఇంటి కొకరు జ్వరం, వైరల్‌, మలేరియా భారినపడి మంచాన పడ్డట్టు గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న వైద్యాధికారి తన వైద్య బృందంతో గ్రామానికి వెళ్లి వైద్యం అందించారు. వర్షాల కారణంగా దోమెడకు వెళ్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అది దాటి గిరిజనులు ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోలేని స్థితిని దృష్టిలో పెట్టుకుని గ్రామానికి వెళ్లి వైద్య పరీక్షలు, రక్త నమూనాలు సేకరించి ఉచితంగా మందులు పంపిణీ చేసి నట్టు డాక్టర్‌ నిఖిల్‌ తెలిపారు. అనంతరం వైద్య సిబ్బందిని గ్రామస్తులు అభి నందించారు. కార్యక్రమంలో హెల్త్‌ ఎడ్యుకేటర్‌ జయశ్రీ, ల్యాబ్‌ టెక్నీషియన్‌ రాంబాబు, ఏఎన్‌ఎం సీతారావమ్మ, ఆశ, నళిని, తదితరులు పాల్గొన్నారు.

Spread the love