
మండలంలోని గొల్లపల్లిలో శనివారం పేద కుటుంబాలకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అటికెల కిషన్ యాదవ్ తాటి పత్రాలను అందజేశారు. గత వారం రోజుల నుండి కురుస్తున్న అకాల వర్షాలకు, ఇంటి పైకప్పులు సరిగా లేకపోవడంతో, వర్షపు నీరు ఇండ్లలోకి రావడంతో, పేద కుటుంబాలను ఆదుకొనడానికి కిషన్ యాదవ్ స్పందించి 20 కుటుంబాలకు తాటి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా బాలిక కుటుంబాలు కిషన్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గొల్ల భూమయ్య, నర్సింలు, రాజనర్సు, మెరుగు పెద్ద రాజయ్య, రాజేశం, మర్కంటి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.