– పి ఆర్ టి యు మండల అధ్యక్షుడు సోట్టిరెడ్డి యుగంధర్ రెడ్డి
నవతెలంగాణ నెల్లికుదురు: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కారం చేసేది పి ఆర్ టి యు అని పిఆర్టియు మండల అధ్యక్షుడు సొంటి రెడ్డి అన్నారు మండల కేంద్రంలోని స్థానిక ఎం ఆర్ సి కార్యాలయంలో గురువారం పి ఆర్ టి యు క్యాలెండర్ ఆవిష్కరించే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేదే కేవలం పి ఆర్ టి యు అని అన్నారు పి ఆర్ టి యు తోనే ఎన్నో రకాలైన సమస్యలను పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నదని అన్నారు విద్యార్థులు అభివృద్ధి కోసమే పి ఆర్ టి యు పనిచేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో టి ఆర్ టి యు రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు బి లక్ష్మణ్ జిల్లా బాధ్యులు రంజాన్ సాయి ప్రసాద్ సంతోష్ జనార్ధన్ రామ్ చరణ్ ధనలక్ష్మి శివాని స్వామి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు