పీఎస్‌ఎల్వీ-సీ56 రాకెట్ ప్రయోగం విజయవంతం

నవతెలంగాణ – హైదరాబాద్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్వీ-సీ56 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. దీనిద్వారా 7  విదేశీ ఉపగ్రహాలను నిర్దేశిత కక్షలోకి పంపించనున్నారు. ఇందులో సింగపూర్‌కు చెందిన డీఎస్‌టీఏ ఎస్టీ ఇంజినీరింగ్‌ సంస్థకు చెందిన డీఎస్‌ ఎస్‌ఏఆర్‌ ఉపగ్రహంతోపాటు నాన్యాంగ్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీకి చెంచిన వెలాక్స్‌-ఏఎం, ఆర్కేట్‌, స్కూబ్‌-2, న్యూలియాన్‌, గెలాసియా-2, ఓఆర్‌బీ-12 శాటిలైట్‌లు ఉన్నాయి. ఇవన్నీ సింగపూర్‌కు చెందినవే కావడం విశేషం. 44.4 మీటర్ల పొడవు, 228 టన్నుల బరువున్న పీఎస్‌ఎల్వీ-సీ56.. ఉప్రగహాలను 535 కిలోమీటర్ల ఎత్తులోని ఎల్‌ ఆర్బిట్‌లో విడిచిపెడుతుంది. తొలుత ఈ ప్రయోగాన్ని జూలై 26నే చేయాలనుకున్నప్పటికీ సాంకేతిక కారణాలతో నేటిని వాయిదా వేశారు. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ శనివారం ఉదయం 5.01 గంటలకు ప్రారంభించారు.

Spread the love