
– పాల్గొన్న ప్రజాప్రతినిధులు అధికారులు
నవతెలంగాణ – మద్నూర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు మద్నూర్ మండలంలోని కొడిచెర గ్రామంలో ప్రజా పాలన గ్రామసభ నిర్వహించారు. గ్రామసభ గ్రామ సర్పంచ్ సంతోష్ పటేల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభలో మండల తాసిల్దార్ ఎండి ముజీబ్ గ్రామ ప్రజలకు ఆరు గ్యారెంటీల అమలు కోసం దరఖాస్తు ఫారాల అందజేత గురించి వివరంగా అవగాహన కల్పించారు. ఈ సభలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్ వీరభద్ర గ్రామ ఎంపీటీసీ సభ్యురాలు యాదాబాయి ఏఎంసీ చైర్మన్ సంగమేశ్వర్ అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్సీ సెల్ అధ్యక్షులు సంజు గ్రామ మాజీ సర్పంచ్ తో పాటు ఆర్ఐ శంకర్ గ్రామ పెద్దలు గ్రామస్తులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.