Tuesday, April 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజారోగ్యమే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల లక్ష్యం: జిల్లా ప్రోగ్రాం అధికారి డా.ప్రసిద్ద్

ప్రజారోగ్యమే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల లక్ష్యం: జిల్లా ప్రోగ్రాం అధికారి డా.ప్రసిద్ద్

- Advertisement -

నవతెలంగాణ-తుంగతుర్తి
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సింది.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలేనని.. ప్రజారోగ్యమే ప్రథమ లక్ష్యంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది పని చేయాలని(ఎన్సివిబిడిసి) జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రసిద్ద్  అన్నారు.మంగళవారం ప్రజాపాలనా.. ప్రగతి ప్రణాళికలో భాగంగా రావులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని,తుంగతుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి మాట్లాడారు.ఈ మేరకు అన్ని నేషనల్ ప్రోగ్రామ్స్ అమలుపై సమీక్ష నిర్వహించి,జాతీయ కీటక జనిత వ్యాధులపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు.

తుంగతుర్తి మండల పరిధిలోని,వసతి గృహాలలో దోమల నివారణ కోసం ఏం చేశారని ఆరా తీశారు.ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో కార్యాలయాల నందు,ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య సౌకర్యాలు మెరుగుపరిచేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రజలందరికీ కుష్టు, క్షయ వ్యాధులపై సంపూర్ణంగా అవగాహన కల్పించాలని,తద్వారా ఈ వ్యాధులను సమూలంగా నిర్మూలించాలని అన్నారు.ఎండలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో వడదెబ్బ నివారణకు అవసరమైన అత్యవసర మందులు,ఓఆర్ఎస్ ప్యాకెట్లు తగినంతగా నిల్వ ఉంచాలని సూచించారు.డెంగ్యూ,మలేరియా వంటి సీజనల్ వ్యాధులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు.అనంతరం పలు రికార్డులను పరిశీలించి,సిబ్బందికి అవసరమైన సూచనలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వారి వెంట జిల్లా మలేరియా అధికారి మోతిలాల్,రావులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ లింగమూర్తి,హెల్త్ అసిస్టెంట్లు గాజుల సోమన్న,లకావత్ యాదగిరి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -