‘ప్రతిపాదిత డీలిమిటేషన్-దక్షిణాది రాష్ర్టాల
స్థితి’ అంశంపై ప్రసంగించనున్న ఈసీఐ మాజీ ప్రధాన కమిషనర్ ఎస్.వై.ఖురేషి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో గల సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం ‘ప్రతిపాదిత డీలిమిటేషన్-దక్షిణాది రాష్ర్టాల స్థితి’ అనే అంశంపై భారత ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ ఎస్.వై.ఖురేషి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ఎస్వీకే మేనేజింగ్ ట్రస్టు కార్యదర్శి ఎస్.వినయకుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. మంగళవారం సాయంత్రం ఆరుగంటలకు ప్రారంభమయ్యే పుచ్చలపల్లి సుందరయ్య 41వ స్మారకోపన్యాసంలో ఎస్వీకే ట్రస్టు అధ్యక్షులు బీవీ.రాఘవులు, కార్యదర్శి తమ్మనేని వీరభద్రం, మేనేజింగ్ కమిటీ సభ్యులు జి.బుచ్చిరెడ్డి పాల్గొంటారనీ, తాను నివేదిక ప్రవేశపెడతానని తెలిపారు. సభానంతరం ప్రముఖ సినీగేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్‌తేజ రచించిన ‘వీర భారతం’ నృత్యరూపకాన్ని త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రదర్శించనున్నట్టు వెల్లడించారు.
నేడు ఎస్వీకేలో పుచ్చలపల్లి సుందరయ్య 41వ స్మారకోపన్యాసం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



