Thursday, June 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

- Advertisement -

నవతెలంగాణ – కట్టంగూర్
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు అందుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ విద్యపై విశ్వాసం పెంచుకుంటున్నారని కట్టంగూర్ ఉన్నత పాఠశాల ఇన్‌చార్జి హెచ్ఎం కొంక ఆంటోని అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని ముత్యాలమ్మగూడెం, బిల్లంకానిగూడెం, కమ్మగూడెం, చవుళ్లగూడెం, మాణిక్యాలమ్మ గూడెం గ్రామాల్లో పర్యటించి తల్లిదండ్రులకు ప్రభత్వ పాఠశాలల ప్రత్యేకతలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించడంతో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరిగిందన్నారు. ఈ విద్యా సంవత్సరంలో 100 కొత్త అడ్మిషన్లు చేర్పించేందుకు లక్ష్యంగా పని చేస్తున్నట్లు వెల్ల‌డించారు. జూన్ 15 నుండి పాఠశాలలు పునః ప్రారంభంవుతాయని తల్లిదండ్రులు తమ పిల్లలను మొదటి రోజు నుండే పాఠశాలలకు పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహమ్మద్ అబ్దుల్ గపూర్, చిన్ని శ్రీనివాస్, చిన్న చంద్రయ్య, లోహిత్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -