Thursday, June 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పార్టీ నాయకుల కుటుంబాలకు అండగా ఉంటా: మాజీ ఎమ్మెల్యే షిండె

పార్టీ నాయకుల కుటుంబాలకు అండగా ఉంటా: మాజీ ఎమ్మెల్యే షిండె

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండల బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విట్టుపటేల్ మాతృమూర్తి ఇటీవల శివైక్యం చెందారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండె గురువారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉండడం తన కర్తవ్యమన్నారు. అదేవిధంగా కార్యక్రమంలో జుక్కల్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొల్లి గంగాధర్, మాజీ జడ్పీటీసీ పండరి, మాజీ ఎంపీపీ బస్వంత్ రావ్ పటేల్, యువ నాయకులు భాను గౌడ్, సొంన్ కాంబ్లె, గజానంద్, గైయాక్వాడ్ విట్టల్ తదితరులు పాల్గొని, వారి సానుభూతిని తెలియజేశారు.

“ఆ దివంగత ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -