Tuesday, May 5, 2026
E-PAPER
Homeజాతీయంరాష్ట్రప‌తిని క‌లిసిన రాఘవ్ చద్దా

రాష్ట్రప‌తిని క‌లిసిన రాఘవ్ చద్దా

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: ఆప్ పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీలు ఇటీవ‌ల బీజేపీలోకి మారిన విష‌యం తెలిసిందే. రాఘవ్ చద్దా, హ‌ర్భ‌జ‌న్ సింగ్, రాజేంద‌ర్ సింగ్ త‌దిత‌రులు క‌మ‌లం పార్టీలో చేరారు. వారి తీరుపై పంజాబ్ రాష్ట్రంలో తీవ్ర నిర‌స‌న‌లు వ్య‌క్తమైయ్యాయి. స‌దురు ఎంపీల ఇంటి ఎదుట ఆప్ శ్రేణులు పెద్ద యోత్తున ఆందోళ‌న చేప‌ట్టాయి. దోహీ అంటూ ఇండి గోడ‌ల‌పై రాత‌లు రాశారు. అంతేకాకుండా వారికి క‌ల్పించిన భ‌ద్ర‌త‌ను కూడా ఆ రాష్ట్ర స‌ర్కార్ విర‌మించుకుంది. ఈక్ర‌మంలోనే తాజాగా పార్టీ మారిన ఎంపీలు రాష్ట్రప‌తిని క‌లిశారు. ఈ మేర‌కు ఎంపీ రాఘవ్ చద్దా సోష‌ల్ మీడ‌యా ఎక్స్ వేదిక‌గా వెల్ల‌డించారు. ఆప్ ప్ర‌భుత్వం త‌మ‌పై క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని, అనైతికంగా కేసులు బ‌నాయిస్తున్నార‌ని ఆయ‌న రాసుకొచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -