Tuesday, May 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆధునిక, శాస్త్రీయ వ్యవసాయంతో అధిక దిగుబడులు 

ఆధునిక, శాస్త్రీయ వ్యవసాయంతో అధిక దిగుబడులు 

- Advertisement -

ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం 
నవతెలంగాణ-మర్రిగూడ 
ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రైతులు ఆధునిక,శాస్త్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేసి అధిక దిగుబడులు పొందాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. మంగళవారం మండలంలోని లెంకలపల్లి గ్రామంలో 99 రోజుల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యచరణలో భాగంగా “ఉద్యానవన-పట్టు పరిశ్రమ శాఖ” ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. వరి, పత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా అధిక దిగుబడులను ఇచ్చే ఉద్యాన పంటలను రైతులు సాగు చేయాలన్నారు. ఆయిల్ పామ్ సాగుతో రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని ఆ పంట పట్ల రైతుల అవగాహన కలిగి ఉండాలని అధికారులు కూడా క్షేత్రస్థాయిలో గ్రామాలలోకి వెళ్లి ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు.

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా రైతుల ఖాతాలో త్వరగ నగదు జమ కావాలన్నారు. ప్రభుత్వం ఏదైనా రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తే తమ గళం ఎప్పుడు రైతుల వెన్నంటే ఉంటుందన్నారు. ఈ ప్రాంతంలో ప్రాజెక్టులు పూర్తయితే సాగునీటి కష్టాలు తీరి ఉద్యాన పంటల సాగు పెరిగే అవకాశం ఉందని, ఇక త్రిబుల్ ఆర్ కూడా పూర్తి అయితే భవిష్యత్తులో ఉద్యాన పంటల సాగుకు, మార్కెట్  ఇబ్బందులు తొలగిపోతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాలు,పురుగుల మందుల వాడకం పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు కూడా క్షేత్రస్థాయిలో రైతులకు విత్తనాలు, పురుగుల మందుల పట్ల అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో చండూర్ మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాస్, మాల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నక్క శ్రీనివాస్ యాదవ్, ఏడిఏ వేణుగోపాల్, లెంకలపల్లి సర్పంచ్ అయితగోని పద్మ వెంకటయ్య గౌడ్, వేమిరెడ్డి సురేందర్ రెడ్డి, ఆర్టికల్చర్ ఆఫీసర్ విద్యాసాగర్, సైంటిస్ట్ విజయకృష్ణ, కొట్టాల సర్పంచ్ కల్లేట్ల లింగయ్య, ఈదుల బిక్షం రెడ్డి, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -