నవతెలంగాణ – హైదరాబాద్ : కాంగోలో ఎబోలా వైరస్ విజృంభిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇక్కడ ఇప్పటివరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం ఆందోళకంగా మారింది. ఈ మేరకు కాంగో ఆరోగ్య అధికారులు ఓ ప్రకటనను విడుదల చేశారు. కాంగోలో ఇప్పటివరకు 550కి పైగా ఎబోలా కేసులు నిర్ధరణ అయ్యాయి. వారిలో 101 మంది ప్రాణాలు కోల్పోగా.. 19 మంది కోలుకున్నారు. మరో 309 మంది ఎబోలా అనుమానితులు ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆదివారం ఒక్కరోజే ఇటురి, నార్త్ కిపులలో 35 కొత్త కేసులు నమోదవగా, మరో 10 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం వైరస్ తీవ్రత పెరుగుతోందని, కొన్నిరోజుల తర్వాత తీవ్రత తగ్గే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. వ్యాధి నిర్ధరణ.. వైరస్‌కు సరైన టీకా, చికిత్స లేకపోవడం సవాళ్లుగా మారాయని తెలిపారు. కేసుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చని భావిస్తున్నారు.
విజృంభిస్తోన్న ఎబోలా.. కాంగోలో 101 మంది మృతి
- Advertisement -
- Advertisement -



