- Advertisement -
నవతెలంగాణ -హైదరాబాద్ : పాకిస్థాన్ నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తూ పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నిరసనకారులు, పాకిస్థాన్ భద్రతా దళాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో 30 మందికిపైగా పౌరులు మృతి చెందగా, మరో 200 మంది గాయపడ్డారు. బింబేర్, కొట్లీ, ముజాఫర్‌బాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
- Advertisement -



