
నవ తెలంగాణ – సిద్దిపేట
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీ ఎన్నిక అవ్వడం ఖాయమని టిపిసిసి సభ్యుడు దరిపల్లి చంద్రం, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు సూర్య వర్మ , డిసిసి ప్రధాన కార్యదర్శి మార్క సతీష్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. సిద్దిపేటలో ముస్తాబాద్ చౌరస్తాలో ఇందిరాగాంధీ విగ్రహం వద్ద , పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తు ఇమామ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్యాగదనుల కుటుంబంలో జన్మించిన రాహుల్ గాంధీ ఎన్నికల్లో ఆయన స్ఫూర్తితో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ హత్ సే హాథ్ జొడో కార్యక్రమం నిర్వహించారని, ప్రజల నుండి కూడా అంతే స్పందన వచ్చిందని అన్నారు. రాహుల్ గాంధీకి మరింత ఆయురారోగ్యాలు ప్రసాదించాలని దేవుని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు గంప మహేందర్, సిద్దిపేట జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, దాస అంజయ్య, మండల అధ్యక్షులు తప్పెట శంకర్, మిట్టపల్లి గణేష్ , బర్మా రామచంద్రం, అజ్జు యాదవ్, జిత్తు, నరసవ్వ , నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.