మునుగోడులో దళితుల మద్దతు రాజగోపాల్ రెడ్డికే..

– ఆపదలో ఉంటే పార్టీలకు అతీతంగా సాయం చేసే గుణం…
– దళితులను దగా చేసిన బీఆర్ఎస్ ను ఓడించాలి..
– పెరిక వెంకటేశ్వర్లు..
– పీసీసీ మెంబర్, ఎస్ సి సెల్ రాష్ట్ర నాయకులు
నవతెలంగాణ- చండూరు 
ప్రజా సమస్యలపై అసంబ్లీలో గళమెత్తిన నాయకుడు మునుగోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నియోజకవర్గంలోని దళితులు అండగా నిలవాలని పి సి సి మెంబెర్ ఎస్ సి సెల్ రాష్ట్ర నాయకుడు పెరిక వెంకటేశ్వర్లు అన్నారు.శనివారం చండూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రస్తుత ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఏనాడు ప్రజల సమస్యలపై అసంబ్లీ లో మాట్లాడిన వ్యక్తి కాదన్నారు. పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో దళితులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని అన్నారు. దళితులకు  మూడు ఎకరాల భూమి ,దళితబంధు పేరుతో దళితులను కేసీఆర్ దగా చేశాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. నియోజకవర్గంలోని సుమారు అరవై వేల ఓటర్లు ఈ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. రాజగోపాల్ రెడ్డి కరోనా సమయంలో పేదలకు అండగా నిలిచారని, ఆపదలో ఉన్న వారికి పార్టీలకు అతీతంగా సహాయం చేసే గుణం కలవడని అన్నారు.కాబట్టి ఈ ఎన్నికల్లో చెయ్యి గుర్తు పై ఓటు వేసి రాజగోపాల్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ సి సెల్ జిల్లా నాయకులు కురుపాటి గణేష్, నాయకులు ఇరిగి వెంకటేశం, మొండికత్తి నర్సింహా, ఇరిగి చరణ్, బుషిపాక శంకర్, శ్రీరాములు,అజయ్ కుమార్, నల్లగంటి జయరాజ్ తదితరులు పాల్గోన్నారు.

Spread the love