నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్: హుస్నాబాద్ పట్టణంలోని మడేలేశ్వర ఆలయ ఆవరణంలో రజక సంఘం యూత్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా రజక యూత్ సంఘం అధ్యక్షులుగా అధ్యక్షుడు పున్న రవీందర్, ఉపాధ్యక్షుడిగా బసవరాజు కన్నయ్య, ప్రధాన కార్యదర్శిగా పున్న రమేష్, కోశాధికారిగా పున్న రమేష్, సహాయ కార్యదర్శిగా పున్న శ్రీనివాస్, సలహాదారుడుగా ఉల్లెందుల సంపత్, ప్రచార కార్యదర్శిగా నేరెళ్ల శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా పున్న శంకర్, పున్న లింగమూర్తి, బసవరాజు నాగరాజు, పున్న చందు, సంఘ అంజి, నాగరాజు, సందీప్ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పున్న సది, పున్న శంకర్, పున్న సంపత్, పున్న లక్ష్మణ్, కొలిపాక రాజు, కొలిపాక రాజేష్, పున్న రమేష్, దుడ్డేల శ్రీనివాస్, వర్కోలు శ్రీనాథ్, చేర్యాల రాజు, జాలిగం రాజు, కొలిపాక నరేష్, జాలియం కుమార్, పున్న మందిర్, రజక సంఘం యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.