Tuesday, May 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరాజయ్య మృతి కార్మికోద్యమానికి తీరని లోటు

రాజయ్య మృతి కార్మికోద్యమానికి తీరని లోటు

- Advertisement -


సీఐటీయూ రాష్ట్ర కమిటీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

సీఐటీయూ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షులు కంపేటి రాజయ్య మృతి కార్మికోద్యమానికి తీరని లోటని ఆ సంఘం రాష్ట్ర కమిటీ తెలిపింది. ఆయన మృతికి తీవ్ర సంతాపాన్ని, కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాముల, పాలడుగు భాస్కర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. రాజయ్య (61) మంగళవారం తెల్లవారు జామున గుండెపోటుతో మరణించారని తెలిపారు. రాజయ్య అనేక కార్మిక, ప్రజా ఉద్యమాల్లో ఆయన కీలక భూమికను పోషించారని గుర్తు చేశారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులుగా, బొగ్గు రంగంలో అఖిల భారత కమిటీ సభ్యులుగా, సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, సింగరేణి కాంట్రాక్ట్‌ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులుగా, జయశంకర్‌ భూపాలపల్లి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులుగా వివిధ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారని తెలిపారు. రాజయ్య ఆదర్శ కార్మిక నేతగా పేరుతెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధనకు కార్యకర్తలందరూ పునరంకితం కావాలనీ, అదే ఆయనకు నిజమైన నివాళి అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -