మహా పాదయాత్రను ప్రారంభిస్తున్న  రజినీకాంత్..

– విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
– ప్రభుత్వ విద్యారంగం – సంక్షేమ హాస్టళ్ల సమస్యల పరష్కారం కోసం చైతన్య మహా పాదయాత్ర
– పెండింగ్ స్కాలర్ షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి
– రాష్ట్ర ఉపాధ్యక్షులు శనిగరపు  రజనీకాంత్
నవతెలంగాణ-వీణవంక
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శనిగరపు రజినీకాంత్ డిమాండ్ చేశారు. విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థి చైతన్య మహా పాదయాత్ర వీణవంకలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాదయాత్ర బృందానికి ఆయన మంగళవారం పూలమాలలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ ఈ యాత్ర 7 వరకు కొనసాగుతుందని చెప్పారు. ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 10 మంది బృందంతో విద్యార్థి చైతన్య మహాపాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ యాత్రను ప్రతీ ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల లేక విద్యార్థులు అనేక ఇబ్బందులతో సతమతం అవుతున్నారని వారు తెలిపారు.  తెలంగాణ రాష్ట్ర ఏర్పడినప్పటి నుండి విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు కనీసం విద్యార్థుల స్కాలర్షిప్ ఫీజు రీయంబర్స్మెంట్ సకాలంలో రాక విద్యార్థుల అనేక ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనమామలు చేస్తారని చెప్పి ఎనిమిది సంవత్సరాల గడుస్తున్నా కానీ ఇంతవరకు కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయలేదని మండిపడ్డారు. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన గురుకులాలు అంటే భవనాలతో అరకొర వసతులతో విద్యార్థులు మానసికంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుందని వారు తెలిపారు. కేజీబీవీ మోడల్ స్కూల్స్ లో కనీసం నాణ్యమైన భోజనం లేక విద్యార్థులు ఆస్తులు పడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుందని వారన్నారు. కేజీవీబీలో జూనియర్ కాలేజీ విద్యార్థులకు కనీసం లెక్చరర్ లేక పాఠశాలకు బోధించేవి ఉపాధ్యాయులతోనే ఇంటర్మీడియట్ విద్యార్థులకు బోధిస్తున్న పరిస్థితి జిల్లాలో నెలకొందని పేర్కొన్నారు. కావున ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, లెక్చరర్, ఎంఈవో పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా మిస్ కాస్మోటింగ్ చార్జీలు పెంచాలని కోరారు. అద్దె భవనాల్లో సాగుతున్న గురుకులాలు, సంక్షేమ హాస్టలకు సొంత భవనాలు నిర్మించాలని, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశమని వారు తెలిపారు. విద్యారంగ పరిరక్షణ కోసం ఈ యాత్ర ముందుకు సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్  మక్కపెళ్లి పూజ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కాంపెళ్లి అరవింద్ గజ్జెల శ్రీకాంత్, సహా కార్యదర్శులు మనోజ్, శ్రీజ, ఉపాధ్యక్షులు  రోహిత్, వినయ్, వినీషా, జిల్లా కమిటీ సభ్యులు రత్నం, సురేష్, సందేశ్, సందీప్, నాయకులు శివ, వంశీ, లావణ్య, నందిని, రమ్య తదితరుల పాల్గొన్నారు.

Spread the love