హయగ్రీవ దేవాలయంలో వృక్షో రక్షతి రక్షితః కార్యక్రమం 

Rakshati Rakshitah Program in Vrikho in Hayagriva Temple– పాల్గొన్న వనజీవి రామయ్య, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య 
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీ లక్ష్మి హయగ్రీవ దేవాలయం ఆధ్వర్యంలో వృక్షో రక్షిత రక్షితః కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పద్మశ్రీ అవార్డు గ్రహీతలు వనజీవి రామయ్య, హనుమంతరావు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ప్రపంచ అవార్డు గ్రహీతలు లిమ్స్ అధినేతలు డాక్టర్ మార్కండేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హయగ్రీవ దేవాలయంలో 27 నక్షత్రాలకు సంబంధించిన 27వృక్షాలు నాటిన కార్యక్రమంలో బీర్ల ఐలయ్య  పాల్గొన్నారు. నక్షత్ర వనంలో ఒకేసారి 27 నక్షత్రముల వృక్షములు నాటినందున అండర్ స్టేట్ లెవెల్ రికార్డు కేటగిరీలో ఐ ఎస్ ఓ సర్టిఫైడ్ సంస్థ ప్రశంసా పత్రమును నల్లంధిఘళ్ లక్ష్మీ నరసింహ చార్యుల కు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో భాస్కరరావు, మదర్ డైరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, వంశి ఆర్ట్ అధినేత వంశీ రామరాజు తదితరులు పాల్గొన్నారు.
Spread the love