న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 59.7 శాతం వృద్ధితో రూ.324.07 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.202.94 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.599.7 కోట్లుగా ఉన్న బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ).. క్రితం క్యూ1లో 32.1 శాతం పెరిగి రూ.792.4 కోట్లకు చేరింది. నికర నిరర్థక ఆస్తులు 0.06 శాతంగా, స్థూల ఎన్పీఏలు 2.62 శాతంగా నమోదయ్యాయి. మొండి బాకీల రికవరీలో బలోపేతంగా ఉన్నామని ఆ బ్యాంక్ ఎండీ, సీఈఓ ఇట్టిరా డావిస్ పేర్కొన్నారు.