రీ ఓపెన్ అయిన జీవన్ రెడ్డి మాల్..

నవతెలంగాణ – ఆర్మూర్ 

ఈనెల 16వ తేదీ హైదరాబాద్ కు చెందిన ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆర్టీసీ పోలీసుల సివిల్ పోలీసుల పర్యవేక్షణలో జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ ను సీజ్ చేసినారు.. కాగా శుక్రవారం ఆర్టీసీ స్థలంలో లీజుపై నిర్మించిన ఈ మాల్ హై కోర్ట్ ఆదేశాల మేరకు రీఓపెన్ చేసినారు .విష్ణుజిత్ ఇన్స్ప కన్స్ట్రక్షన్ లిమిటెడ్ పేరు మీద లీజుకు తీసుకున్న ఆశన్న గారి రజిత రెడ్డి హైకోర్టును ఆశ్రయించి ఆర్టీసీ అధికారులు వేసిన సీజ్ పై ప్రశ్నించారు ..గత వారం రోజులుగా జీవన్ రెడ్డి మాల్ మూసివేతతో మాల్ లోని దుకాణాలు మొత్తం మూతపడడంతో పరిసర ప్రాంతాలు నిర్మానిష్యంగా మారాయి. దీంతో రీఓపెన్ కావడంతో జనంతో సందడి వాతావరణం నెలకొంది.
Spread the love