డాక్టరేట్ వన్నెల దాసు శ్రీనివాస్ ను అభినందించిన రిజిస్ట్రార్ ఎం యాదగిరి.. 

నవతెలంగాణ- డిచ్ పల్లి: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని  సారంగాపూర్ ఎడ్యుకేషన్ కళాశాలలో పనిచేస్తున్న  కాంటాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వన్నెల దాసు శ్రీనివాస్ నాగార్జున యూనివర్సిటీ నుండి సెకండరీ పాఠశాల విద్యార్థుల పఠణ అలవాట్లు – సాధించిన విజయాలు అనే అంశంపై సిద్ధాంత గ్రంథాన్ని అందించినందుకు డాక్టరేట్ ప్రధానం చేశారు. పీహెచ్డీ పర్యవేక్షకులుగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్  బలరాములు వ్యవహరించారాని, నాగార్జున యూనివర్సిటీ పీహెచ్డీ వింగ్ కోఆర్డినేటర్  ఏ సోమశేఖర్ తెలిపారు. సెకండరీ గ్రేడ్ స్థాయిలో పిల్లల  సరియైన వేళలో జరిగే రీడింగ్ అలవాట్లే విద్యార్థుల  విజయాలను ప్రభావితం చేస్తాయని  పరిశోధనలో తెలిసిందని పేర్కొన్నారు.  మౌన పఠనము ద్వారా  విద్యార్థుల్లో గ్రహకశక్తి అధికంగా ఉంటుందని  తను సేకరించిన దత్తాంశం ద్వారా బహిర్గతమైందని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా  బాల్కొండ మండలం, కిసాన్ నగర్ గ్రామం పేద కుటుంబంలో  వన్నెల దాస్ నర్సుబాయ్ క్రీ.శే-వెంకన్న ల జన్మించిన, వన్నెల దాస్ శ్రీనివాస్ బాల్యం నుండి అనేక కష్టాలను ఎదిరించి ఉన్నత విద్యను అందుకోవడం గర్వంగా ఉందని ఆ రిజిస్ట్రార్ పేర్కొన్నారు. తెలంగాణ యూనివర్సిటీ విద్యా కళాశాల సారంగాపూర్ లో పనిచేస్తున్న వన్నెలదాస్ శ్రీనివాస్ పరిశోధన విద్యారంగంలో జరిగే ఆధునిక  మార్పులకు ఒక దిక్చూచిగా ఉంటుందని  రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి పేర్కొన్నారు. విద్యారంగంలో మరిన్ని పరిశోధనలు చేయాలని శ్రీనివాసును అభినందించారు.
Spread the love